Telangana - Churakalu

కరీంనగర్ లో రాజకీయ ఉద్రిక్తత.... గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి
కరీంనగర్ లో రాజకీయ ఉద్రిక్తత

బండి సంజయ్ పై పాడి కౌశిక్ తీవ్రవ్యాఖ్యలు

గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి

కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం.. రంగంలోకి పోలీసులు

చురకలు కరీంనగర్ బ్యూరో:

కరీంనగర్లో రాజకీయ యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు బీజేపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. కరీంనగర్ పట్టణంలో అదనపు సిబ్బందితో నిఘా పెంచారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, దానికి నిరసనగా బీజేపీ శ్రేణులు చేసిన దాడితో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గంగుల ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు పాడి కౌశిక్ రెడ్డి రాగా.. బీజేపీ శ్రేణులు ఆ కార్యాలయంపై దాడి చేశారు. లోపల కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం కొనసాగుతుండగానే.. బీజేపీ కార్యకర్తలు కార్యాలయంపై దాడిచేశారు. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

"బండి సంజయ్ కు డ్రగ్స్ అలవాటు ఉంది"

కరీంనగర్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తంబాకులో డ్రగ్స్ కలిపి తినడం వల్లే బండి సంజయ్ కు బట్టతల వచ్చిందని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం తమకు కూడా చేతనవుతుందని, బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. గతంలో ఆయన తన భార్య పుస్తెల్ని అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారన్నారు. ఎన్నికల్లో బండిసంజయ్ పంచినద అవినీతి డబ్బా లేక రేవంత్ పంపిన డబ్బా అని ప్రశ్నించారు. కేటీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఏ అంశం మీదనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కౌశిక్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ టెస్టుకు కేటీఆర్ ను తాను తీసుకొస్తానని, ఇందుకు బండి సంజయ్ కూడా సిద్ధం కావాలని సవాల్ చేశారు. బండి సంజయ్ కు డ్రగ్స్ అలవాటు ఉందని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో దాడులకు పాల్పడ్డారు.

అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి హైకోర్టు లో టీడబ్ల్యుజేఎఫ్ పిటిషన్
*అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి*
*-హైకోర్టులో టీడబ్ల్యూజేఎఫ్ పిటిషన్*

హైదరాబాద్, మే 05: మీడియా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ లు చేసిన, చేయబోయే నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ(ఎస్ ఎంఏసీ), జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ(డీఎంఏసీ)లలో తమ టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులకు అవకాశం కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అక్రెడిటేషన్ కార్డులపై నిర్ణయాలు చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 ప్రకారం కమిటీలో నాలుగు జర్నలిస్టు యూనియన్ లు/సంఘాల ప్రతినిధులు ఉండాలని, కానీ కేవలం మూడు యూనియన్ ల/సంఘాల ప్రతినిధులను మాత్రమే చేర్చి తమ యూనియన్ ప్రతినిధులను తీసుకోకుండా పెండింగ్ పెట్టి ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఈ పిటిషన్ లో ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్, మీడియా అకాడమీ ఛైర్మెన్ లతో పాటు 33 జిల్లాల ప్రజా సంబంధాల అధికారులు
(డీపీఆర్వో)లను ప్రతివాదులుగా చేర్చారు.
*అక్రెడిటేషన్ కమిటీల జీవో 229 రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్*
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మీడియా అక్రెడిటేషన్ల జీవో 252 కి అనుబంధంగా రాష్ట్ర, జిల్లా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో ఆర్టీ 229 ను నిబంధనలకు విరుద్దంగా అమలు చేసినందున ఈ జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టు లో మంగళవారం పిటిషన్ దాఖలైంది. టీడబ్ల్యూజేఎఫ్ సభ్యుడు, ఏవీఎన్ టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలు అనే జర్నలిస్టు జీవో 229 అమలు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అక్రెడిటేషన్ కమిటీలలో నాలుగు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఉండాలని జీవో 252లో పేర్కొనగా, జీవో ఆర్టీ 229 ద్వారా కేవలం మూడు సంఘాల ప్రతినిధులను మాత్రమే తీసుకున్నారని, టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ప్రతినిధులను కమిటీల్లోకి తీసుకోకుండా కమిటీ నిర్ణయాలు చేయడం జీవో 252 కు విరుద్దమని, అందుకని ఈ జీవో ఆర్టీ 229ను సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటీషన్ లో కూడా ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్ ను, మీడియా అకాడమీ ఛైర్మన్,అన్ని జిల్లాల డీపీఆర్వోలను ప్రతివాదులుగా చేర్చారు.

తెలంగాణలో డీఎస్పీల బదిలీలు
తెలంగాణలో డీఎస్పీలు, ఏసీపీల బదిలీలు

ఓయూ ఏసీపీగా నర్సింగరావు
జగిత్యాల డీఎస్పీగా పురుషోత్తంరెడ్డి
కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్
వికారాబాద్ జిల్లా ఏసీపీగా అంజయ్య
మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ ఏసీపీగా రాజశేఖర్‌రెడ్డి
ఆసిఫాబాద్ డీఎస్పీగా అశోక్
భద్రాచలం డీఎస్పీగా అరుణ్‌కుమార్
నిర్మల్ డీఎస్పీగా టీ శ్రీనివాస్
ఉప్పల్ ఏసీపీగా వెంకట్‌రెడ్డి
చిక్కడపల్లి ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి
మలక్‌పేట ఏసీపీగా రాజా వెంకట్‌రెడ్డి
గోషామహల్ ఏసీపీగా చంద్రశేఖర్‌రెడ్డి
ఆసిఫ్‌నగర్ ఏసీపీగా శ్రీనివాస్
మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీగా వెంకటేశ్వరరావు

ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు.... జీవన్ రెడ్డి చేరికతో మారనున్న సమీకరణలు
ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు: జీవన్ రెడ్డి చేరికతో మారనున్న సమీకరణాలు.

జన సమీకరణలో దిగ్గజాలు!.. సభలో కేసీఆర్ మాటల తూటాలు?

​రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్...9440595494

​తెలంగాణ రాజకీయ యవనికపై జగిత్యాల గడ్డ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు చూసిన ఈ ప్రాంతం, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పునరుజ్జీవనానికి కేంద్రబిందువుగా మారుతోంది. ఏప్రిల్ 20న నిర్వహించ తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభ కేవలం ఒక రాజకీయ ప్రదర్శన మాత్రమే కాదు, అది తెలంగాణ రాజకీయ గమనాన్ని మార్చగల ఒక వ్యూహాత్మక అస్త్రం.

దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ఏలిన తర్వాత, ఊహించని విధంగా అధికారాన్ని కోల్పోయిన అనంతరం గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) సుదీర్ఘ విరామం తర్వాత ప్రజల ముందుకు వస్తుండటం ఈ సభకు అత్యంత ప్రాధాన్యతను చేకూర్చింది. గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో ఆవరించిన స్తబ్దతను వీడి, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపడానికి, పోగొట్టుకున్న ప్రజా విశ్వాసాన్ని తిరిగి సంపాదించు కోవడానికి కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది.

చారిత్రక విశ్లేషణను పరిశీలిస్తే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎప్పుడూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. 2001లో సిద్దిపేటలో పుట్టిన ఉద్యమం, కరీంనగర్ "సింహగర్జన"తోనే మలుపు తిరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే పాత వైభవాన్ని, రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి జగిత్యాలను ఎంచుకోవడం ద్వారా కేసీఆర్ తన రాజకీయ పునఃప్రారంభానికి సెంటిమెంట్‌ను, శక్తిని జోడిస్తున్నారు.

​ఈ సభకు మరింత బలాన్ని, చర్చను చేకూరుస్తున్న ప్రధానాంశం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి భారాసలో చేరబోతుండటం. కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ప్రజాబలం ఉన్న శక్తిగా, మేధావిగా, నైతిక విలువలతో కూడిన నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన గొంతుకగా ఉన్న ఆయన, సొంత పార్టీలోనే నెలకొన్న అంతర్గత విభేదాలు లేదా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో భారాస తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీకి నైతిక విజయాన్ని అందించడమే కాకుండా, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బగా పరిగణించవచ్చు. జీవన్ రెడ్డి వంటి ప్రజాబలం ఉన్న నేత కేసీఆర్ సరసన నిలబడటం వల్ల, కేవలం జగిత్యాల నియోజకవర్గమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ఉన్న బి.ఆర్.ఎస్ శ్రేణులకు కొండంత అండ లభించినట్లవుతుంది. ఇది కేవలం ఒక సాధారణ రాజకీయ ఫిరాయింపుగా కాకుండా, ఒక బలమైన భావజాల కలయికగా ప్రాజెక్ట్ చేయడం ద్వారా మధ్యతరగతి, విద్యావంతులైన ఓటర్లను ఆకట్టుకోవాలని భారాస యోచిస్తోంది.

​జగిత్యాల ప్రాంతం సామాజికంగా అత్యంత చైతన్యవంతమైనది. ఇక్కడ బీసీ సామాజిక వర్గాల ప్రభావం, గల్ఫ్ కార్మికుల సమస్యలు, రైతాంగ పోరాటాలు రాజకీయ ఫలితాలను శాసిస్తాయి. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం 70 నుండి 75 శాతం మధ్య నమోదు కావడం ఇక్కడి ప్రజల రాజకీయ అవగాహనకు నిదర్శనం. ఈ నేపథ్యంలో, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాల లబ్ధిదారులను నేరుగా పలకరించడం ద్వారా, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఆ పథకాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కేసీఆర్ ఎండగట్టే అవకాశం ఉంది. ప్రత్యేకించి 'రైతు భరోసా' అమలులో ఏర్పడిన చిక్కులు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని, తన హయాంలో వ్యవసాయ రంగం ఎంత సుభిక్షంగా ఉండేదో వివరించడం ద్వారా గ్రామీణ ఓటు బ్యాంకును మళ్ళీ తనవైపు తిప్పుకోవడం ఆయన లక్ష్యం. తెలంగాణ సాధన కోసం సాగిన పోరాటంలో జగిత్యాల పాత్రను గుర్తు చేస్తూ, సెంటిమెంట్‌ను పండించడంలో దిట్ట అయిన కేసీఆర్, తన ప్రసంగంతో ప్రజల భావోద్వేగాలను తట్టిలేప నున్నారు.

​ఈ సభ విజయవంతం కావడానికి పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే రంగంలోకి దిగి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఓటమి తర్వాత చెల్లాచెదురైన కార్యకర్తలను ఏకం చేయడం, గ్రామస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడంపై వారు దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అపారమైన పలుకుబడి కలిగిన నేతలు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎలగందుల రమణ, రాజేశం గౌడ్ వంటి ఉద్ధండులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీరితో పాటు కోరుట్లకు చెందిన విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, లోక బాపూరెడ్డి, చెలిమెడ, శ్రీకాంత్ రెడ్డి, బాల్క సుమన్ తదితర నేతల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విస్తృతమైన జన సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నాయకత్వ బృందం గ్రామ గ్రామాన తిరుగుతూ పార్టీ శ్రేణులను చైతన్య పరుస్తోంది.

దశాబ్ద కాలం నాటి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ భారీ ఎత్తున జనాన్ని తరలించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మందితో నిర్వహించనున్న ఈ సభ కోసం పార్టీ శ్రేణులు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న జన సమీకరణ భారాసకు ఇది 'జీవన్మరణ' సమస్యగా మారిందని సూచిస్తున్నాయి.

​రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న 'ఆరు గ్యారంటీల'పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ అసంతృప్తిని తన వైపు మలుచు కోవడానికి కేసీఆర్ కు జగిత్యాల సభ ఒక చక్కని అవకాశం. అలాగే, బిజెపి రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్న తరుణంలో, తామే అసలైన ప్రతిపక్షమని నిరూపించుకోవడం భారాసకు అనివార్యం. జగిత్యాల సభ ద్వారా వెలువడే రాజకీయ సందేశం కేవలం జిల్లాకే పరిమితం కాకుండా, గద్వాల నుండి అదిలాబాద్ వరకు ప్రతి కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సభలో కేసీఆర్ ప్రకటించబోయే భవిష్యత్ కార్యాచరణ—అంటే జిల్లాల పర్యటనలు, ప్రజా పోరాటాల రూపకల్పన—పార్టీ మనుగడకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఓటమి కారణాలను విశ్లేషించుకున్న తర్వాత, నాయకత్వం మరియు ప్రజల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించుకోవడానికి ఈ బహిరంగ సభను ఒక వారధిగా వాడుకోవాలని పార్టీ పటిష్టమైన నిర్ణయం తీసుకుంది.

​జగిత్యాల రాజకీయాల్లో ఏప్రిల్ 20న జరగబోయే ఈ మహాసభ తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతోంది. అధికార పక్షానికి సవాల్‌గా, ప్రతిపక్షాలకు హెచ్చరికగా, శ్రేణులకు మార్గదర్శకంగా ఈ సభ రూపుదిద్దుకుంటోంది. కేసీఆర్ వాగ్ధాటి, జీవన్ రెడ్డి చేరికతో పెరిగిన నైతిక బలం, ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నేతల సమన్వయం, మరియు భారీ జనసమీకరణ—ఈ అంశాలు కలిపి భారాస మళ్ళీ పుంజుకుంటుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వనున్నాయి. రాజకీయాల్లో ఓటమి శాశ్వతం కాదు, గెలుపు నిరంతరం కాదు అనే సత్యాన్ని నమ్మే కేసీఆర్, తన రాజకీయ చతురతతో జగిత్యాల నుండి మళ్ళీ 'జైత్రయాత్ర'ను ఎలా ప్రారంభించబోతున్నారో వేచి చూడాలి. ఈ సభ ఫలితం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మరియు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఖచ్చితంగా తన ముద్ర వేస్తుంది. తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు జగిత్యాల వైపు ఆసక్తిగా చూస్తోంది, ఎందుకంటే అక్కడి నుండి వెలువడే సింహగర్జన రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు తెరలేపనుంది.  ప్రజల్లో ఉన్న నిశ్శబ్ద మార్పును పసిగట్టడంలోనూ, దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడం లోనూ ఈ సభ బి.ఆర్.ఎస్ పార్టీకి అగ్నిపరీక్ష వంటిది. ఈ చారిత్రక సందర్భం కేసీఆర్ నాయకత్వ పటిమను, భారాస కేడర్ మనోధైర్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ సభ ప్రభావం రాష్ట్ర రాజకీయ దిశను ఏ విధంగా మారుస్తుందో అన్నది అత్యంత ఆసక్తికరమైన అంశం.

ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 45 ఏళ్లు......
ఇంద్రవెల్లి...
నెత్తుటి  మరకలకు 45ఏండ్లు....        ---ఆదివాసులకు అండగా నిలిచిన పోరకల   దొరలు..                  భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాటన రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో 1981 ఏప్రిల్ 20న కదం తొక్కడంతో జనసంద్రంతో సభ నిండుకున్నది.అక్కడ చేరుకున్న పోలీసులలో ఒక కానిస్టేబుల్ ఆదివాసి మహిళను అనుచితంగ ప్రవర్తించడంతో ప్రాణానికన్నా శీలం ముఖ్యమని భావించే ఆమహిళా చేతులో ఉన్న కొడవలితో దాడి చేయడంతో పోలీసులు రెచ్చిపోయి జరిపిన కాల్పుల్లో గోండు ప్రజలు లెక్కలేకుండా చనిపోయారు. ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసుల కాల్పుల సంఘటనలో ఆదివాసుల హక్కులు ప్రపంచానికి తెలియడమే కాకుండా మరో జలియన్ వాలాబాగ్ గా చరిత్రగా నిలిచింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరీ గ్రామంలో భూస్వాములపై ఆదివాసీ రైతులు తిరుగుబాటుతో వెలుగులోకి వచ్చిన  వారి ఉద్యమం శ్రీకాకుళం చేరుకొని భూమి భుక్తి  విముక్తి కోసం రైతంగ పోరాటాలకు ఊపిరి పోసింది. కరీంనగర్ జిల్లాలో విద్యార్థి రైతాంగా పోరాటాల స్ఫూర్తితో జగిత్యాల జైత్రయాత్ర  సాగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు (గోండు గిరిజనులకు)అండగా నిలిసింది. అర్ధ ఆకలితో బతుకు వెల్లదీసిన గోండులు ఆకలి,ఆనారోగ్యం బారిన పడి ప్రాణాలు కాపాడే వారు లేక దిగజారుతున్న బతుకులకు దిక్కు లేకపోవడం కుంగు బాటుకు గురి చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా విస్తరించిన అడవిలో వ్యాపారులు పటేల్ పట్వారి వ్యవస్థ చేస్తున్న, ఆగడాలు, దోపిడికి, ఆదివాసులు గురికావడంతో దిక్కులేక దిగులు పడుతున్న తరణంలో 1974 సంవత్సరం లలో అడుగుపెట్టిన అన్నల(పొరకలసార్లు)  ఆధ్వర్యంలో ఆదివాసులకు అండగా ఉండడం తో ఆకుల కల్లాలపై ఆదివాసుల పెత్తనం పెరగడం తో  పీపుల్స్ వార్ ( ప్రజల యుద్ధం )ఆధ్వర్యంలో రైతు కూలి సంఘం  ఉధ్యమించడంతో  ఆదివాసులు పిలుచుకునే పొరకల దొరల అండతో అడవి పై భూమిపై మాదే హక్కు అంటూ జిల్లాలో పోడు భూములను దున్నుకోవడం ఉద్యమించసాగారు. వేలాది ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న పెత్తందారుల పెత్తనం కోల్పోయిన పాలకులు పటేల్  పట్వారిలకు,ప్రభుత్వంకు కంటి నిండ కునుకు లేకుండా పోయింది.
జల్-జంగిల్-జమీన్ ఆదివాసీలు తమ భూములు, అడవి, హక్కుల కోసం  ఉద్యమించారు. సీపీఐ యంఎల్ "పీపుల్స్ వార్ ( ప్రజలయుద్ధం) ఆధ్వర్యంలోని గిరిజన రైతు కూలీ సంఘం, ఆదివాసీలకు భూమి పట్టాల కోసం భూస్వాముల భూమి ఆక్రమణలను నిరసిస్తూ ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేసింది.
అడవిపై హక్కుల కోసం ఆదివాసీలు ఈ సభకు పెద్ద సంఖ్యలో ఆదివాసీలు విల్లు, బాణాలు, కర్రలతో  తరలివచ్చారు.

1981 ఏప్రిల్ 20 న ఆదివాసీలు నిరసన తెలుపుతుండగా పోలీసులు సభపై కాల్పులు జరిపారు. ఒక కానిస్టేబుల్‌ను చంపారని అందువల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసుల ఆరోపణ..
అమరులైన గిరిజనులు  ఘటనలో అధికారికంగా 13 మంది ఆదివాసీలు మరణించినట్లు ప్రకటించారు, కానీ అనధికారికంగా వందల మంది చనిపోయారని, చాలా మంది ఆదివాసీలు అడవుల్లోకి పారిపోయారని, కొందరు చనిపోగా వారి మృతదేహాలను కూడా పోలీసులు దహనం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
సభ  ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్  సభలపై నిషేధం విధించారు, సభ విజయవంతం కోసం ఆదివాసులు అధిక సంఖ్యలో సభకు తరలి వచ్చినారు.

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా మేధావుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆదివాసీల భూ హక్కుల పోరాటాన్ని అణచివేయడానికి ఈ కాల్పులు జరిపారని విమర్శలు వచ్చాయి.
ఘటన జరిగిన చోట ఆదివాసీల అమరవీరుల స్థూపాన్ని  నిర్మించారు, దీనిని పోలీసులు 1986లో కూల్చివేసి, తర్వాత ప్రజా నిరసనలకు తలొగ్గిన  ప్రభుత్వం స్థూపాన్ని నిర్మించడానికి ఒప్పుకొంది.
ఈ ఘటన జరిగి నేటికీ 45 ఏళ్లు,  ఆదివాసీ ప్రజలకోసం చేసిన త్యాగాలకు ప్రతీకగా దూరం ప్రాంతాలనుండి చుట్టు గ్రామాల నుండి జాతర లాగ ప్రజలు ఎడ్ల బండ్ల పై  ఇంద్రవెల్లికి వచ్చిస్తూపం వద్ద ప్రతి ఏట అమరుల త్యాగాలను ఎత్తి పట్టుతు చుట్టు ప్రాంతం ప్రజలు నివాళులు అర్పిస్తారు...................................   *బాలసాని రాజయ్య*                        *సినియర్ జర్నలిస్ట్* 9866102315...
బాలసాని రాజయ్య                         సీనియర్ జర్నలిస్ట్ పెద్దపల్లి. 9441970025

జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జగిత్యాల ముఖ్య నాయకులతో ముగిసిన ముఖ్యమంత్రి రెడ్డి భేటీ.

జగిత్యాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో పరిస్థితులను పంచుకోవాలనే మీతో సమావేశమయ్యా.

మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూడలేదు.. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదు

ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదు

2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం

పార్లమెంటు ఎన్నికల్లో ఆయన్ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం

కానీ ఆయన నిజామాబాద్  నుంచి పోటీ చేస్తానని కోరినా పార్టీ టికెట్ ఇచ్చింది.

దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు

మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి గారు సూచించిన వారికే టికెట్లు ఇచ్చాం

భవిష్యత్ లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ కు హామీ ఇచ్చినా వినలేదు.

మొండి పట్టుతో జీవన్ రెడ్డి గారు పార్టీ వీడారు

40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి… దుర్మార్గుడైన కెసిఆర్ తో జతకట్టారు.

జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరం

జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి గారు కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు

ఆయన వయసుకు,అనుభవానికి ఇది తగదు

ఈనాటికీ నేను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదు

కుట్రలను తిప్పి కొట్టాలని మనం ప్రయత్నం చేస్తుంటే… ఆయన వెళ్లి అక్కడ చేరారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెట్టడం తప్పా..

నేను చేస్తుంది మంచో చెడో మీరే ఆలోచించండి

ఎవరు ఏమిటి అన్నది కాలమే నిర్ణయిస్తుంది

అండగా నిలబడండి… మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం

ధైర్యంగా ఉండండి…త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తా…

అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం

వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నా..

విద్యార్థుల కఠిన శ్రమతోనే ఉత్తమ ఫలితాలు, ఆల్పోర్స్ చైర్మన్ వి, నరేందర్ రెడ్డి
విద్యార్థుల కఠిన శ్రమతోనే ఉత్తమ ఫలితాలు.

అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 14 : విద్యార్థుల కఠిన శ్రమ, అధ్యాపకుల సరైన మార్గనిర్దేశనంతో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అల్ఫోర్స్ కళాశాలలో ఇటీవలే విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థులను డా. నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం.పి.సి, బై.పి.సి, సి.ఈ.సి, ఎం.ఈ.సి విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారన్నారు. ఎంపిసి ఫస్ట్ ఇయర్ జీ స్నేహిత, 468/470, రాచర్ల ఆశ్విత వర్మ,- 468/470, తుమ్మనపల్లి సహస్ర- 468/470, లవంగ శ్రీజ- 468/470 మార్కులతో మొదటి స్థానంలో నిలువగా సహస్ర 467/470 జోసెఫ్ 467/470 మరియమ్, 467/470, టి. అప్తిచంద్ర 467/470 మార్కులు సాధించారు. ఎంపిసి సెకండ్ ఇయర్ లో లహరి సందరికారి -995/1000- మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, నవ్య పల్లికొండ 994, లాస్య రెడ్డి గోగురి 993 మార్కులు సాధించారని తెలిపారు. బైపిసి విభాగం సెకండ్ ఇయర్ అన్సా హురియా 994/1000, సోబియా తస్నీమ్ 994/1000, రీష ఫాతిమా 993/1000 మార్కులతో సత్తా చాటారు. బైపిసి ఫస్ట్ఇయర్ అల్మాస్ ఫాతిమా -438/440- శ్రీలక్ష్మి 437/440 మార్కులు, ఎల్ శ్రీలక్ష్మి 437/440, హనఫా హననియా 436 / 440, నబియా నౌసిన్ 436/440, సఫరా జుఫీషా 436/440, ఏం అక్షయ 436/440, మార్కులు సాధించారని, సిఈసి విభాగం ఫస్ట్ ఇయర్ లో అన్నం మెహరోజ్ -494/500, డి వైష్ణవి 491/500, కే శ్రీ వర్ష 488/500, కే ప్రణీత 488/500 అత్యుత్తమ ప్రతిభ కనబరచగా, సిఈసి సెకండ్ ఇయర్ లో బావజ్ఞ పెల్లె -987– ఎండి సంసియా 984/1000, మౌనిక 984/1000, అర్పాత్ అనీమ్ 983 / 1000 మార్కులు సాధించారన్నారు. ఎంఈసి సెకండ్ ఇయర్లో నిస్మా తబస్సుమ్ 980/1000 మార్కులతో ఘన విజయం సాధించారన్నారు.

మతమంటే జీవన విధానం
మతమంటే జీవన విధానం: హిందుత్వ వైభవాన్ని చాటిన ధర్మపురి సమ్మేళనం...

ధర్మపురి క్షేత్రాన ధర్మధ్వజం: హిందూ సమాజ ఐక్యతకు చైతన్య గీతం

సమరస సమాజమే ధర్మ లక్ష్యం: జగన్నాథం విష్ణువర్ధనాచార్య ప్రబోధం

రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494

ధర్మపురి పుణ్యక్షేత్రం వేదికగా సాగిన హిందూ సమ్మేళనం కేవలం ఒక సమూహ కలయికగానే కాక, కాలప్రవాహంలో మరుగున పడుతున్న సనాతన ధర్మ మూలాలను తట్టిలేపి, హిందూ సమాజ ఐక్యతకు దిశానిర్దేశం చేసిన ఒక చారిత్రక ఘట్టంగా భాసిల్లింది. ఈ సమ్మేళనంలో వినిపించిన గొంతుకలు, ప్రవచించిన సిద్ధాంతాలు భారతీయ జీవన విధానంలోని విశిష్టతను చాటిచెప్పడమే కాక, ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఆధ్యాత్మిక, సామాజిక పరిష్కారాలను సూచించాయి. ముఖ్యంగా జగన్నాథం విష్ణువర్ధనాచార్య వంటి ఆధ్యాత్మిక కోవిదుల ప్రసంగాలు సభకు ప్రాణవాయువుగా నిలిచి, ప్రతి హిందువు తన బాధ్యతను గుర్తించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.

​విశ్వం అనేది సహస్రశీర్ష పురుషుని స్వరూపమని, ఆ అనంత విశ్వంలో మానవుడు అతి స్వల్పమైన వాడని ఉభయ వేదాంత పండిత ప్రకాండులు విష్ణువర్ధనాచార్య చేసిన విశ్లేషణ శ్రోతలలో వినయ విధేయతలను రేకెత్తించింది. తల్లి, తండ్రి, గురువు అనే త్రిమూర్తుల సేవ ద్వారానే మనిషి జీవితం సార్థక మవుతుందన్న ఆయన మాటలు భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తుచేశాయి. కుటుంబమే సమాజానికి మూలమని, ఉత్తమ తల్లిదండ్రులు ఉన్నప్పుడే క్రమశిక్షణ గల సంతానం ఉద్భవిస్తుందని, అప్పుడే దేశం శక్తివంతమవుతుందని ఆయన వివరించిన తీరు అద్భుతం. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లిన సనాతన ధర్మం, నేడు కేవలం భారతదేశానికే పరిమితం కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హిందూ ధర్మం అంటే కేవలం పూజలు, పునస్కారాలు మాత్రమే కాదని, అది ప్రకృతి సమతుల్యతను కాపాడే ఒక జీవన సూత్రమని, దీనికి భంగం కలిగితే ప్రపంచ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించడం అత్యంత ఆలోచనాత్మకం. ఇతర మతాల దాడులు, అంతర్గత కుల విభేదాలు, అధర్మ ఆచరణలు సనాతన ధర్మాన్ని బలహీన పరుస్తున్నాయని, వీటిని అధిగమించాలంటే హిందువులందరూ భేదభావాలను విడనాడి ఐక్యంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇమ్మడి శ్రీనివాస్ సమర్థ నాయకత్వంలో సమ్మేళనం గంభీరంగా సాగింది. కార్యక్రమం ఆరంభంలో వెలిగించిన జ్యోతి ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లడమే కాక, సమాజంలో నెలకొన్న అజ్ఞానపు చీకట్లను పారద్రోలే జ్ఞానదీపంగా నిలిచింది. రంగు లక్ష్మీ నరహరి తన ప్రసంగంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ద కాలపు ప్రస్థానాన్ని వివరిస్తూ, ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కొని సంస్థ ఎలా నిలదొక్కుకుందో వివరించారు. ప్రతి ఇంటికి హిందూ జాగరణను తీసుకెళ్లడంలో ఆరెస్సెస్ పాత్ర అద్వితీయమని, శివాజీ. భగత్ సింగ్ వంటి ధైర్యసాహసాలు గల యువతను తయారు చేయడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యమని ఆయన అభిప్రాయ పడ్డారు. దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలంటే ముందుగా యువతలో చైతన్యం రావాలన్న ఆయన పిలుపు సభికుల్లో ఉత్సాహాన్ని నింపింది.

​మరోవైపు జర్నలిస్ట్ నవత ప్రసంగం సామాజిక బాధ్యతను గుర్తుచేసే విధంగా సాగింది. భారతదేశంలో జన్మించడం అనేది పూర్వజన్మ సుకృతమని చెబుతూ, స్వార్థచింతన వీడి సమాజ సేవకు అంకితం కావాలన్నారు. ఆమె ప్రతిపాదించిన 'పంచ పరివర్తన' మార్గదర్శకాలు నేటి సమాజానికి దిక్సూచి వంటివి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ రహిత జీవనం, జల సంరక్షణ, వృక్షోపాసన చేయాలని ఆమె కోరారు. కుటుంబ విలువలను కాపాడుకోవాలని, కుల వ్యవస్థ పేరుతో విదేశీయులు నాటిన విభజన బీజాలను పెకిలించి వేయాలని, సమరసతతో కూడిన సమాజాన్ని నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా ఆర్థికంగా బలపడాలని, తద్వారా గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించడం లోతైన విశ్లేషణకు నిదర్శనం.

​సనాతన సంప్రదాయాల్లోని శాస్త్రీయతను మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. భారత భూమిని కేవలం భూభాగంగా కాకుండా ఒక పూజామందిరంగా భావించాలని, "వసుధైవ కుటుంబకం" అనే భావనతో జీవించాలని ఆమె అన్నారు. మనం పాటించే కట్టు, బొట్టు వెనుక ఉన్న అంతరార్థాలను వివరిస్తూ, సంప్రదాయబద్ధమైన జీవనం శారీరక, మానసిక వికాసానికి ఎలా తోడ్పడుతుందో ఆమె స్పష్టం చేశారు.

అలాగే, ప్రధాన వక్త సామల కిరణ్ గారు శేషప్ప పద్యాలతో ప్రసంగాన్ని రక్తి కట్టిస్తూ, హిందూత్వం అనేది ఒక మతం కాదని, అది అనంతమైన జీవన ప్రవాహమని పేర్కొన్నారు. దేవుడిని నమ్మే వారిని, నమ్మని వారిని కూడా తనలో కలుపుకునే విశాల హృదయం హిందూ ధర్మానికి మాత్రమే ఉందని ఆయన చెప్పిన మాటలు భారతీయ సంస్కృతిలోని సహనాన్ని చాటిచెప్పాయి.

​సభా ప్రాంగణంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు కేవలం వినోదం కోసమే కాకుండా, భారతీయ కళా వైభవాన్ని కళ్లకు కట్టేలా సాగాయి. నక్కలపేట మోడల్ స్కూల్ మరియు చైతన్య భారతి పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు దేశభక్తిని, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించాయి. ఈ ప్రదర్శనలు చూస్తుంటే, మన సంస్కృతి సురక్షితమైన చేతుల్లోనే ఉందన్న భరోసా కలిగింది.

​ ధర్మపురి హిందూ సమ్మేళనం అనేది ఒక ఆలోచనాత్మక విశ్లేషణకు వేదికైంది. కులాల విభజనను దాటి, స్వార్థ రాజకీయాలను వీడి, హిందూ సమాజం ఒక్కటిగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సభ ఘోషించింది. వ్యక్తిగత పరివర్తన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని, ఆ మార్పు కుటుంబం నుండి ప్రారంభం కావాలని వక్తలు ముక్తకంఠంతో చాటారు. పర్యావరణంపై మమకారం, స్వదేశీ వస్తువులపై గౌరవం, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగినప్పుడే భారత్ తన పూర్వ వైభవాన్ని సంతరించు కుంటుంది. హిందూ ధర్మ పరిరక్షణే ప్రపంచ శాంతికి మూలమని, అది మనందరి సమిష్టి బాధ్యతని ఈ సమ్మేళనం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ స్ఫూర్తి ప్రతి హిందువు గుండెలో నిలిచి, సమాజ చైతన్యానికి నాంది పలుకుతుందనడంలో సందేహం లేదు. అప్పుడే మన దేశం నిజమైన అర్థంలో విశ్వగురువుగా వెలుగొందుతుంది. ఈ దిశగా సాగిన ప్రతి అడుగు, ప్రతి ప్రసంగం హిందూ సమాజ ఐక్యతకు పటిష్టమైన పునాదిగా నిలవాలని సమ్మేళనం ఆశిస్తున్నది.

నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల విడుదల
నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల.

చురకలు విలేకరి, జగిత్యాల, ఏప్రిల్ 11 :జగిత్యాల జిల్లా నేరేళ్ల కేంద్రానికి చెందిన ఎంఎల్హెచ్పీ లు ఇటీవలే విడుదలైనా నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తా చాటారు. జోన్ 2 బీసీ-సీ కేటగిరీ లో జగిత్యాల జిల్లాకి చెందిన శ్యామ్ బాబు- ఎలిజబెత్ రాణి దంపతుల పెద్ద కుమార్తే  చీలి హరిణి రాష్ట్ర స్థాయిలో 278 ర్యాంక్ సాదించింది. ప్రస్తుతం  జైన(పీహెచ్‌సీ నేరేళ్ల )లో విధులు నిర్వహిస్తుండగా, గాంధీ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. రంగసాగర్ గ్రామానికీ చెంధిన బతుల శ్రుతి (ర్యాంక్ 449)ప్రస్థుతం డోనూరులో విధులు నిర్వాహిస్తు బీసీ-బీలో 2వ ర్యాంక్ సాదించింది. వేణుగుమట్ల గ్రామానికీ చెందింది అనగందుల నరేష్ (905వ ర్యాంకు) బీసీ-బీ లో 6వా ర్యాంక్ ,ప్రస్తుతం బుగ్గరంలో విధులు నిర్వహిస్తుండగా, వీళ్లు ముగ్గురు ఒకే పీహెచ్‌సీకి చెందిన వారు.

కాంగ్రెస్ రెండేళ్ల పాలన కంటే కేసీఆర్ పదేళ్ల పాలన మెరుగు జీవన్ రెడ్డి
కాంగ్రెస్ రెండేళ్ల పాలన కంటే  కేసీఆర్ పదేళ్ల పాలనే మెరుగు జీవన్ రెడ్డి

మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం – హాట్ కామెంట్స్..

కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనే మెరుగని వ్యాఖ్య..

రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలకు కేసీఆర్ కృషి గుర్తింపు..

రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు..

గతంలో నష్టపోయిన రైతులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని..

కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో విఫలమైందని..

ఉద్యోగులు, నిరుద్యోగులను పట్టించుకోలేదని..

పెన్షన్లు పెంచకపోవడం, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంపై అసంతృప్తి..

ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు లేవని విమర్శ..

ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని..

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ఎవరూ విస్మరించలేరని స్పష్టం..

రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజల అభిప్రాయం అన్న వ్యాఖ్య..

బీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంకేతం..

తుది నిర్ణయం, కార్యాచరణపై కేటీఆర్ నిర్ణయం ఉంటుందని స్పష్టం..

జగిత్యాల రాజకీయాల్లో హీట్ పెరిగింది...!

డిజిటల్ వేదిక పై శరత్ కుమార్ మేధో విలాసం
సంప్రదాయం + సాంకేతికత = అద్భుత అవధానం: డిజిటల్ వేదికపై శరత్ కుమార్ మేధో విలాసం

​ధర్మపురి పాండిత్య వైభవం: అవధాన ప్రక్రియలో నూతన శకం - వొజ్ఝల శరత్ కుమార్ సాహిత్య ప్రస్థానం

​రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494

​తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన ధర్మపురి క్షేత్రం అనాదిగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, శాస్త్రీయ సంపదలకు నిలయంగా భాసిల్లుతోంది. దక్షిణ భారతదేశం లోని అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం, కేవలం భక్తి పరంపరలకే కాక వేద వేదాంగాలు, శాస్త్రాగమాలు, సాహిత్య కళలకు పుట్టినిల్లుగా నిలిచింది. క్రీస్తుశకం 9వ శతాబ్దం నుంచే ఈ ప్రాంతం విద్యాభ్యాసానికి, విశేష వేదాధ్యయనాలకు కేంద్రంగా విలసిల్లిందనడానికి ఇక్కడి శాసనాధారాలు, స్థానిక వంశావళులు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కాళేశ్వరం, వేములవాడ, బాసర వంటి ప్రసిద్ధ క్షేత్రాల సరసన ధర్మపురిని కూడా చేర్చి, పండితులు దీనిని “త్రిభుజ తపోభూమి”గా అభివర్ణించడం ఈ నేల యొక్క విశిష్టతను చాటిచెబుతోంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువుదీరిన ఈ పుణ్యధామంలో అర్చక సంప్రదాయాలు, యక్షగాన ప్రదర్శనలు, హరికథా కాలక్షేపాలు ఒకదానితో ఒకటి మిళితమై ఒక అద్భుతమైన సాంస్కృతిక సమన్వయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. తరతరాలుగా ఇక్కడ కొనసాగుతున్న విద్యా పరంపరలో సంస్కృతం, తెలుగు, ప్రాకృత భాషల్లో నిష్ణాతులైన పండితులు ధర్మపురిని ఒక “విద్యా క్షేత్రం”గా తీర్చిదిద్దారు. కాలక్రమేణా ఆధునిక విద్యా వ్యవస్థలు ప్రవేశించినప్పటికీ, సంప్రదాయ విద్యా మూలాలను, ఆ ప్రాచీన పాండిత్య గరిమను కాపాడుకుంటూ రావడం ఈ క్షేత్రానికున్న ప్రత్యేక గౌరవం.

ఈ మహోన్నత పాండిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, ఆధునిక కాలంలో ధర్మపురి గడ్డపై ఉద్భవించిన అద్భుత ప్రతిభావంతుడు డాక్టర్ వొజ్ఝల శరత్ కుమార్ తన అనన్య సామాన్యమైన ప్రతిభతో సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో సమానమైన పట్టు సాధించి “త్రిభాషా కవి”గా గుర్తింపు పొందారు. ప్రాచీన ఛందస్సాహిత్యంపై దృఢమైన పట్టు కలిగి ఉంటూనే, ఆధునిక భావ వ్యక్తీకరణలో తనదైన ముద్ర వేయడం డాక్టర్ శరత్ కుమార్ ప్రత్యేకత. ఆయన రచించిన శతకాలు సాహిత్య లోకంలో విశేష ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనను ఒక శక్తివంతమైన కవిగా నిలబెట్టాయి. భక్తి, నైతికత, సామాజిక స్పృహ కలగలిసిన ఆయన కవిత్వం పండిత పామరులను అలరిస్తోంది.

​తెలుగు సాహిత్య ప్రక్రియల్లో అత్యంత కఠినమైనది, మేధోపరమైనది అయిన ‘అవధానం’లో డాక్టర్ శరత్ కుమార్ ప్రవేశించడం ధర్మపురి సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి పోతుంది. శ్రీ నారాయణీ అవధాన వేదిక ద్వారా నిర్వహించబడిన డాక్టర్ వొజ్ఝల శరత్ కుమార్  ప్రథమ అష్టావధానం అటు సంప్రదాయాన్ని, ఇటు ఆధునిక సాంకేతికతను మేళవించి సాహిత్య లోకానికి కొత్త వెలుగును పంచింది. ఈ కార్యక్రమానికి సంచాలకులుగా గణపతి అశోక్ శర్మ వ్యవహరించగా, ముఖ్య అతిథిగా ముద్దు రాజయ్య వ్యవహరించారు. విద్వాన్ బైరపనేని పోతురాజు చౌదరి సభా నిర్వహణ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా చేపట్టి కార్యక్రమ జయప్రదానికి తోడ్పడ్డారు. జూమ్ యాప్ వంటి డిజిటల్ మాధ్యమం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడిన ఈ అవధానంలో పృచ్ఛకులుగా ఉద్దండ పండితులు పాల్గొని అవధాని మేధస్సుకు పదును పెట్టారు. నిషిద్ధాక్షరిలో మాచవోలు శ్రీధర్ రావు సంధించిన అక్షర అడ్డంకులను శరత్ కుమార్ చాకచక్యంగా అధిగమించగా, దత్తపదిలో చంద్రశేఖర్ శర్మ ఇచ్చిన క్లిష్ట పదాలను ఛందస్సులో ఇముడ్చుతూ అద్భుతమైన పద్య రచన చేశారు. సమస్య పూరణలో ఈమని మల్లికార్జున రావు విసిరిన వైచిత్రిని సమయ స్ఫూర్తితో పూరించి సభికులను మంత్రముగ్ధులను చేశారు. వర్ణనలో పి.యల్. నాగేశ్వర రావు కోరిన అంశాలను అత్యంత రమణీయంగా చిత్రించగా, న్యస్తాక్షరిలో కౌండిన్య నండూరి వేంకటేశ్వర రాజు సూచనల మేరకు అక్షర విన్యాసాన్ని ప్రదర్శించి తన ధారణా శక్తిని చాటుకున్నారు. మాల్యాల సోమేశ్వర రావు  కోరిన ఆశు కవిత్వంలో ధారాశుద్ధిని, విద్వాన్ బైరపనేని పోతురాజు చౌదరి  నిర్వహించిన పురాణ పఠనంలో పాండిత్యాన్ని ప్రకటిస్తూ అవధాని సాగించిన ప్రయాణం తొలి సారి అయినా అది అద్వితీయం. వీటన్నింటి మధ్య దుర్గి శ్రవణ్ కుమార శర్మ  అప్రస్తుత ప్రసంగం సభలో హాస్యపు జల్లులు కురిపిస్తూ ఆహ్లాదాన్ని నింపింది.

​ఈ అష్టావధానం కేవలం కవితా శక్తికి మాత్రమే పరిమితం కాకుండా, ఏకకాలంలో అనేక అంశాలపై దృష్టి సారించగలిగే ఏకాగ్రతను, అమోఘమైన ధారణా శక్తిని, సమయస్ఫూర్తిని, శబ్ద నైపుణ్యాన్ని ఆవిష్కరించింది. డిజిటల్ యుగంలో సంప్రదాయ కళలు అంతరించిపోతాయన్న భయాలను పటాపంచలు చేస్తూ, సాంకేతికతను సాహిత్య వ్యాప్తికి ఎలా ఉపయోగించుకోవచ్చో శరత్ కుమార్ నిరూపించారు.

ధర్మపురి పుణ్యక్షేత్ర చరిత్రలో వేద పండితులు, శాస్త్ర కోవిదులు ఎందరో ఉన్నప్పటికీ, ఆధునిక కాలంలో ఈ క్షేత్రం నుండి అవధానిగా ఎదిగిన తొలి వ్యక్తిగా డాక్టర్ వొజ్ఝల శరత్ కుమార్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించ దగినది. ఈ విజయం స్థానిక యువతకు, విద్యార్థులకు ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. తెలుగు భాషా సాహిత్యాలకు ప్రాభవం తగ్గుతోందన్న ఆందోళన ఉన్న తరుణంలో, శరత్ కుమార్ వంటి యువకులు అవధాన కళను భుజానికెత్తుకోవడం శుభపరిణామం. ఆయన రచనల్లో కనిపించే సాహిత్య విలువలు, సామాజిక సందేశాలు నేటి తరం యువతకు దిక్సూచిగా మారుతున్నాయి. ప్రాచీన సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ఆధునిక పోకడలను ఆహ్వానించే ఆయన దృక్పథం సాహిత్య రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది.

సంప్రదాయం మరియు ఆధునికతల ఈ అరుదైన సంగమం ధర్మపురి క్షేత్రానికి నూతన శోభను చేకూరుస్తోంది. వేదాల హోరు, గోదావరి జలాల జోరుతో పునీతమైన ఈ నేల, ఇప్పుడు అవధాన పద్యాల హోయలుతో పులకించి పోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచ పటంలో నిలబెట్టడానికి సంకల్పం, సాధన ఉంటే సరిపోతుందని ఈ యువ అవధాని నిరూపించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని గొప్ప సాహిత్య విజయాలు సాధించి, తెలుగు భాషా కీర్తిని దశదిశలా వ్యాపింప జేయాలని, ఆయన స్ఫూర్తితో మరిన్ని ప్రతిభావంతమైన మస్తిష్కాలు ధర్మపురి నేల నుండి ఉద్భవించాలని ఆశిద్దాం. పాతను గౌరవిస్తూ కొత్తను ఆహ్వానించే ఈ సాహిత్య ప్రయాణం నిరంతరాయంగా సాగి, తెలుగు సాహిత్య వైభవం కలకాలం వర్ధిల్లాలి.

చంపక మాల...
సకల కవిత్వ తత్త్వముల సారము గన్న శరత్ కుమారుడున్,
ప్రకటిత డిజిటల్ తెరల పై నవధానము జేసె వింతగా,
సుకవిగ ధర్మపురి క్షేత్రము శోభను పెంచెను పద్య విద్దెతో
వికసిత కీర్తి తోడ నిక విశ్వము మెచ్చగ సాగు నెప్పుడున్!

జిల్లా గ్రంధాలయ సంస్థ చేర్మెన్ గా దీనిష్
మూడు దశాబ్దాల నిబద్ధతకు ప్రతిఫలం – జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా దినేష్ నియామకం

రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్

జిల్లా రాజకీయాల్లో మౌనంగా పనిచేసే, కానీ ప్రభావవంతమైన నాయకత్వంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగన భట్ల దినేష్‌ నియామకం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జరగడం ఒక విధంగా ప్రజాసేవకు ఆయన చేసిన దీర్ఘకాల కృషికి లభించిన గౌరవంగా భావించవచ్చు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, క్రమంగా ప్రజా సమస్యలపై పట్టుదలతో ముందుకు సాగుతూ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. గ్రామస్థాయి నాయకత్వం నుంచి జిల్లా స్థాయి బాధ్యతల వరకు ఎదిగిన ఆయన ప్రయాణం, నేటి యువ నాయకులకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రస్తుతం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగన భట్ల దినేష్‌, పార్టీ వ్యవస్థలో క్రమశిక్షణ, నిబద్ధత, సమన్వయం అనే విలువలను ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుగా సాగాయి. పార్టీ సిద్ధాంతాలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిలా భావిస్తూ, వారికి ప్రోత్సాహం ఇవ్వడం ఆయన ప్రత్యేక లక్షణం.
గతంలో ధర్మపురి ఎంపీటీసీగా పనిచేసిన సమయంలోనే ఆయన ప్రజా సమస్యలపై లోతైన అవగాహనను పెంపొందించు కున్నారు. గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, స్థానిక ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో, వాటి పరిష్కారానికి కృషి చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఎంపీటీసీగా ఉన్నప్పుడే ఆయన ప్రజల మధ్య విశ్వసనీయ నాయకుడిగా ఎదిగారు.

దివంగత మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు  అనుచరుడిగా సంగన భట్ల దినేష్‌  రాజకీయంగా మరింత పరిపక్వత సాధించారు. రత్నాకర్ రావు సాన్నిధ్యంలో ఆయన రాజకీయ దిశ, దృక్పథం మరింత బలపడింది. నాయకత్వం అంటే కేవలం అధికారంలో ఉండటం కాదు, ప్రజలకు సేవ చేయడం అనే భావనను ఆయన గురువు ద్వారా నేర్చుకున్నారు. అదే మార్గంలో నడుస్తూ, తన రాజకీయ జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారు.

ధర్మపురి దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన చూపిన పరిపాలనా నైపుణ్యం ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. దేవస్థాన అభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యలు భక్తుల ప్రశంసలను అందుకున్నాయి. ఆలయ పరిసరాల అభివృద్ధి, సదుపాయాల విస్తరణ, పారదర్శక పరిపాలన వంటి అంశాల్లో ఆయన చేసిన కృషి స్పష్టంగా కనిపించింది. భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంలో ఆయన చూపిన కట్టుబాటు, ఆయన పరిపాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని వీడకుండానే కొనసాగుతున్న ఆయన రాజకీయ ప్రయాణం, నేటి రాజకీయ పరిస్థితుల్లో అరుదైన ఉదాహరణగా చెప్పవచ్చు. అనేక ఒడిదుడుకులు, మార్పులు వచ్చినప్పటికీ పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఏమాత్రం తగ్గలేదు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సేవను ప్రాధాన్యంగా తీసుకున్న నాయకుడిగా ఆయన నిలిచారు. ఈ స్థిరత్వమే ఆయనకు పార్టీ నాయకత్వం నుంచి విశ్వాసాన్ని తీసుకువచ్చింది.
సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అత్యంత సన్నిహితులైన దినేష్, ఆయన
చొరవతో సంగన భట్ల దినేష్‌ ను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నియమించడం, ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన నిర్ణయంగా భావించవచ్చు. ఈ బాధ్యత ఆయనకు ఒక సవాలుగా కూడా నిలుస్తోంది. గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులలో చదువుపట్ల ఆసక్తి పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లో జ్ఞాన వనరులను విస్తరించడం వంటి లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనపై ఉంది.

ప్రస్తుతం సమాజంలో పుస్తక పఠనం తగ్గిపోతున్న నేపథ్యంలో, గ్రంథాలయాల ప్రాముఖ్యతను తిరిగి ప్రజలకు తెలియజేయడం అత్యవసరం. ఈ దిశగా సంగన భట్ల దినేష్‌ చేపట్టబోయే కార్యక్రమాలు కీలకంగా మారనున్నాయి. డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రంథాలయాలను ఆధునీకరించడం, యువతను ఆకర్షించే విధంగా పుస్తకాల ఎంపిక, పఠన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో ఆయన వినూత్న ఆలోచనలు అమలు చేస్తారని ఆశించవచ్చు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించడం ద్వారా, విద్యా రంగానికి ఆయన అందించే సేవలు మరింత విస్తరించే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాల కొరతను తీర్చడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విషయాన్ని గుర్తించి, ప్రతి గ్రామానికి గ్రంథాలయ సౌకర్యాన్ని చేరువ చేయడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యంగా నిలవాలి.

సంగన భట్ల దినేష్‌ వ్యక్తిత్వంలో కనిపించే వినయం, కృషి, ప్రజల పట్ల ప్రేమ, పార్టీ పట్ల నిబద్ధత—కలగలిపి ఆయనను ఆదర్శ నేతగా నిలబెట్టాయి. ఆయన రాజకీయ జీవితం కేవలం పదవుల కోసం కాకుండా, ప్రజా సేవ కోసం సాగుతున్నదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లక్షణాల వల్లే ఆయనకు జిల్లా స్థాయిలో ఈ కీలక బాధ్యత లభించింది.

మొత్తంగా చూస్తే, సంగన భట్ల దినేష్‌ గారి నియామకం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జరగడం ఒక వ్యక్తిగత విజయమే కాకుండా, ప్రజాసేవకు ఆయన చేసిన నిరంతర కృషికి లభించిన గుర్తింపుగా భావించాలి. భవిష్యత్తులో ఆయన ఈ బాధ్యతను సద్వినియోగం చేసుకుని, జిల్లా విద్యా అభివృద్ధికి, జ్ఞాన విస్తరణకు కీలక పాత్ర పోషిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.