గంగారెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి

గంగారెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి

పోలీసులు నిర్లక్ష్యంతోనే గంగారెడ్డి హత్య..

కుట్రలు, వాస్తవాలను వెలికితీయలేక పాత కక్ష్యలని పోలీసులు చెప్పడం విడ్డురం.

గంగారెడ్డి హత్యపై విచారణ నిష్పక్షపాతంగా జరిపించాలి.

పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కార్యకర్తలు ఆందోళన నెలకొంది.

గంగారెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శించిన మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 26 : పోలీసులు నిర్లక్ష్యంతోనే గంగారెడ్డి హత్య జరిగిందని, కుట్రలు, వాస్తవాలను వెలికితీయలేక పాత కక్ష్యలని పోలీసులు చెప్పడం విడ్డురమని, గంగారెడ్డి హత్యపై విచారణ నిష్పక్షపాతంగా జరిపించాలని, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కార్యకర్తలు ఆందోళన నెలకొందని ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగారెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
ఈ సందర్బంగా మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ గంగారెడ్డి అతి దారుణంగా హత్యకు గురికావడం ‌బాధకరమని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొన్న వ్యక్తి గంగారెడ్డి అని, తనకి ప్రాణహాని ఉందని పోలీసులకి చెప్పుకున్నారని, 
ప్రాణానికి ముప్పు ఉందని చెప్పిన పోలిసులు ఎందుకు పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో‌ కాంగ్రెస్ నాయకులు హత్య‌ గురి కావడం బాధకరమని, 
ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలిసులు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకొవాల్సిన అవసరం తమపై  ఉందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా భావంతో కెటిఆర్ మాట్లాడారని,  ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకున్నామని, 2014 లో ఉమ్మడి ‌జిల్లా నుండి ఒక్కరే  జీవన్ రెడ్డి గెలిచారని, 
బిఅర్ఎస్ ఎన్ని ప్రలోభాలు‌ పెట్టిన బిఅర్ఎస్ లోకి వెళ్ళలేదని గుర్తు చేశారు. 
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 
ఫిరాయింపులతో  ఆత్మస్థైర్యం కోల్పోయామని, ప్రత్యర్థులు రెచ్చిపోయారని, గంగారెడ్డి హత్యలో పోలిసుల నిర్లక్ష్యం ఉందని మండిపడ్డారు.
గంగారెడ్డి కి వాట్సప్ లో బెదిరించిన పోలిసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 100 డయల్ ఫోన్ చేసిన పట్టించుకోలేదన్నారు.
దసరా పండుగ రోజు డిజెలు పగులగొట్టిన పోలిసులు ‌పట్టించుకోలేదని, కుట్రలని, వాస్తవాలని వెలికి తీయలేకనే పాత కక్ష్యలు అని పోలిసులు చెబుతున్నారని, తాను ఓ కుటుంబ సభ్యున్ని కోల్పోయానని, ఒక నేరస్థుడు పోలిసు‌ స్టేషన్ లో రీల్స్ తీస్తే పోలిసుల ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.IMG-20241026-WA0005

Tags:

Related Posts