సన్నబియ్యం పంపిణి చారిత్రాత్మక నిర్ణయం
సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం
చురుకలు ప్రతినిధి
మెట్ పల్లి ఏప్రిల్ 27: రాష్ట్ర ప్రభుత్వం పేదలకుసన్న బియ్యం పంపిణీ చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఆదివారం పట్టణంలో ని అతియా బేగం కుటుంబ సభ్యులతో వారి ఇంట్లో వారితో కలిసి వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్. మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా. రాష్ట్ర సేవాదళ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ అందే మారుతి బాపూజీ సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం పేద ప్రజల కడుపు నింపుతుందన్నారు. రాష్ట్రంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న నిరు పేద లందరికి పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం కార్యక్ర మం చేపటామన్నారు. ఈ పథకం పక్కగా అమలుపర్చేందుకు రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరే రాజకుమార్ మొహమ్మద్ రహీముద్దీన్ మహమ్మద్ అనాస్ మహమ్మద్ మదర్ తదితరులు పాల్గొన్నారు