ఇఫ్తార్ విందులు మత సమరస్యానికి ప్రతీక

ఇఫ్తార్ విందులు మత సమరస్యానికి ప్రతీక

ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక.

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 12 : ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిరాజోద్దీన్ మన్సూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ హజరై పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని, మైనార్టీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ కమలోద్దీన్, నాయకులు సమీండ్ల శ్రీనివాస్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మున్ను తదితరులు పాల్గొన్నారు.IMG-20260312-WA0130

Tags: