జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జగిత్యాల ముఖ్య నాయకులతో ముగిసిన ముఖ్యమంత్రి రెడ్డి భేటీ.
జగిత్యాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
రాష్ట్రంలో పరిస్థితులను పంచుకోవాలనే మీతో సమావేశమయ్యా.
మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూడలేదు.. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదు
ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదు
2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం
పార్లమెంటు ఎన్నికల్లో ఆయన్ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం
కానీ ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని కోరినా పార్టీ టికెట్ ఇచ్చింది.
దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు
మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి గారు సూచించిన వారికే టికెట్లు ఇచ్చాం
భవిష్యత్ లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ కు హామీ ఇచ్చినా వినలేదు.
మొండి పట్టుతో జీవన్ రెడ్డి గారు పార్టీ వీడారు
40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి… దుర్మార్గుడైన కెసిఆర్ తో జతకట్టారు.
జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరం
జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి గారు కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు
ఆయన వయసుకు,అనుభవానికి ఇది తగదు
ఈనాటికీ నేను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదు
కుట్రలను తిప్పి కొట్టాలని మనం ప్రయత్నం చేస్తుంటే… ఆయన వెళ్లి అక్కడ చేరారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెట్టడం తప్పా..
నేను చేస్తుంది మంచో చెడో మీరే ఆలోచించండి
ఎవరు ఏమిటి అన్నది కాలమే నిర్ణయిస్తుంది
అండగా నిలబడండి… మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం
ధైర్యంగా ఉండండి…త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తా…
అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం
వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నా..

