జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జాతీయ మెగా లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి.
జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 24 : ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి కోరారు. మంగళవారం జిల్లా కోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను, న్యాయవాదులు, కోర్టులో సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు నారాయణ, వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, కోర్టు అధికారులు పాల్గొన్నారు.

