గంజాయు రవాణా చేస్తున్న నిండుతుడు అరెస్ట్

గంజాయు రవాణా చేస్తున్న నిండుతుడు అరెస్ట్

గంజాయి రవాణా చేస్తున్న నిందితుడు అరెస్ట్

270 గ్రాముల గంజాయి స్వాధీనం.. పాత కేసులు వెలుగులోకి

జగిత్యాల: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలు, ఎస్డీపీఓ డి. రఘు చందర్ సూచనల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
పోలీసుల సమాచారం మేరకు ఏప్రిల్ 10 సాయంత్రం గొల్లపల్లి రోడ్డులోని విద్యానగర్ బైపాస్ వద్ద టౌన్ ఎస్ఐ ఎన్. సధాకర్ సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని వద్ద 270 గ్రాముల ప్రభుత్వ నిషేధిత గంజాయి లభించింది.
నిందితుడు గౌస్ ఖాన్ (32), మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్‌కు చెందినవాడిగా గుర్తించారు. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్ఐ ఎం. సుప్రియ నిందితుడిని రిమాండ్‌కు పంపించారు.
నిందితుడిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయం, వినియోగాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ఇన్స్పెక్టర్ పి. కరుణాకర్ హెచ్చరించారు.IMG-20260411-WA0197

Tags: