పెద్ద చెరువు తూము మరమ్మతులు చేపట్టాలి
వీణవంక పెద్ద చెరువు తూము మరమ్మతులు చేపట్టాలి.
చురకలు విలేఖరి వీణవంక మార్చి 08:
వీణవంక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వీణవంక పెద్ద చెరువు తూము మరమ్మతులు చేపట్టాలని అధికారులకు 3 సంవత్సరాలుగా విన్నపించిన పట్టించుకోవడం లేదని,చెరువులో నీటి శాతం తగ్గి వేడికి చేపలు చనిపోవడం దీంతో 3 వదల మత్స్య సకారుల కుటుంబాలు జీవన ఉపాధి కోల్పోవడంతో పాటు కుటుంబాలురోడ్డున పడే పరిస్థితి ఉందని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే పనులు చేపట్టాలి. ఈ కార్యక్రమంలో వీణవంక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మోటం వెంకటేష్, సెక్రటరీ కుమారస్వామి, డైరెక్టర్లు చుక్కల రవీందర్ రాయిశెట్టి రవి,రాము, ఓదెలు, సభ్యులు రాయిశెట్టి సంపత్ గుర్రం కొమురయ్య,రాయిశెట్టి సదానందం,రమేష్, మోహన్, సమ్మయ్య శ్రీనివాసు వెంకటేశ్వర్లు మొగిలి రాజయ్య ,సాగర్ తదితరులు పాల్గొన్నారు.

