లింగమూర్తి మృతి విద్యారంగానికి తీరని లోటు

లింగమూర్తి మృతి విద్యారంగానికి తీరని లోటు

కాకతీయా IMG-20260315-WA0056మాజీ వీసి
ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి మృతి విద్యారంగానికి తీరని లోటు

నేదునూరి కనకయ్య 
తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం 
అధ్యక్షుడు 


కరీంనగర్, మార్చ్,15

ప్రముఖ ఆర్థికవేత్త, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ లింగమూర్తి ఆకస్మిక మరణం ఆర్థిక శాస్త్రానికి, యూనివర్సిటీ విద్యారంగానికి తీరని లోటని 
తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం 
అధ్యక్షుడు నేదునూరి కనుకయ్య 
ఒక ప్రకటనలో తెలిపారు.

కాకతీయ విశ్వవిద్యాలయ వీసీగా పనిచేసిన లింగమూర్తి 
అనారోగ్య కారణాలతో శనివారం 
వరంగల్ లో మృతి చెందారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో కనుకయ్య మాట్లాడుతూ
కాకతీయ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రవేశపెట్టి, యూనివర్సిటీ విద్యను గ్రామీణ పేద బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులోకి  తేవడానికి ఆయన అమలు చేసిన సంస్కరణలు వెలకట్టలేని వన్నారు.ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రొఫెసర్ లింగమూర్తి మరణం ఉన్నత విద్యారంగానికి తీరని లోటని, వారి ఆశయాల సాధన కొరకు కృషి చేయడమే నిజమైన నివాళి అని నేదునూరి కనకయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దూరవిద్య వ్యాప్తి కోసం కృషిచేసి 
గ్రామీణులకు సైతం విద్యను అందుబాటులోకి తెచ్చిన ప్రగతి శీల, ప్రజాస్వామ్య పాలనా వేత్తగా లింగమూర్తిని అభివర్ణించారు.
సమావేశంలో ఎకనామిక్ ఫోరం సలహాదారులు డాక్టర్ కే మురళి మాట్లాడుతూ ప్రొఫెసర్ లింగమూర్తి మూర్తి లేబర్ ఎకనామిక్స్ లోపట్టున్న గొప్ప ఆర్థిక శాస్త్ర అధ్యాపకులుగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శ్రామిక విధానాల రూపకల్పనలో ఆయన 
క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు.ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సి హెచ్  శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ విసి లింగమూర్తి యూనివర్సిటీ విద్యా అభివృద్ధికి  చేసిన సేవలను కొనియాడుతూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, యువ ఆర్థికవేతలకు స్పూర్తిగా నిలుస్తాయన్నారు.
ఈ సమావేశంలో డాక్టర్ మనోహరచారి, డాక్టర్ టివి స్వామి,  పరుశరాంరెడ్డి,  వీరాస్వామి,
బైరీ సుధాకర్, తిరుమల్ తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

Tags: