ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్ గా ఇమ్రాన్ నియమకం

ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్ గా ఇమ్రాన్ నియమకం

ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్ గా ఇమ్రాన్ 

జగిత్యాల, మార్చి, 14

జగిత్యాల జిల్లా కేంద్రంలోని జమా మసీద్‌లో ముస్లిం మత పెద్దలు,ముస్లిం కమిటీ సమావేశం నిర్వహించి సెంట్రల్ ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ ఇమ్రాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న మహమ్మద్ అలీ గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో పాటు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మత పెద్దలు ఆయనను తొలగించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్‌ను మత పెద్దలు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ భారీ, జనరల్ సెక్రటరీ హాజా నయుముద్దీన్ మంజూర్, అబ్దుల్ సజీద్, అఖీల్ ఉద్దిన్ జావీద్, పట్వారి సాజిద్, పట్వారి ముజాహిద్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా, కౌన్సిలర్లు కమల్, అయూబ్ ఖాన్, అఫ్రోజ్, అహ్లే హదీస్ జగిత్యాల కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్, జమాతే ఇస్లామియా నాయకులు ఈమాదుద్దీన్, తౌహీద్ అలీ, పాత్రికేయులు మోసిక్, హైదర్ అలీ, అదిల్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260314-WA0043

Tags: