బృందావనం రిసార్ట్ అధినేత కొండల్ రావు పుట్టిన రోజు వేడుకలు

బృందావనం రిసార్ట్ అధినేత కొండల్ రావు పుట్టిన రోజు వేడుకలు

*బృందావనం రిసార్ట్‌ అధినేత కొండలరావు పుట్టినరోజు వేడుకలు*
కొడిమ్యాల ఆగస్టు 11.( చురకలు )IMG-20260811-WA0097(1) మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఉన్న బృందావనం రిసార్ట్ అధినేత కొండల్ రావు పుట్టినరోజు వేడుకలను ప్రెస్ మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రుల సమక్షంలో కొండల్ రావు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ప్రెస్ మిత్రులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అదే రోజు నవగీతం న్యూస్.స్టార్ 9 న్యూస్ రిపోర్టర్ చెన్న దేవేందర్ పుట్టినరోజు కూడా కావడంతో బృందావనం రిసార్ట్‌లోనే మీడియా మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.ఈ సందర్భంగా మీడియా మిత్రులు మాట్లాడుతూ కొండల్ రావు, చెన్న దేవేందర్‌లు ఆయురారోగ్యాలతో, ఆనందంగా, అభివృద్ధితో, శ్రేయస్సుతో జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చొక్కాల మహిపాల్, చెన్న దేవేందర్, కొండూరి సురేష్, భోగ సూర్య, మార్గం ఆదిత్య, కంచర్ల గంగాచారి, కొత్తూరు పవన్ తదితర ప్రెస్ మిత్రులు పాల్గొన్నారు.

Tags:

Related Posts