బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ
బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ
-భగీరథ్ ను కేసు నుంచి తప్పించేందుకు కుట్రలు
-ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులైనా అరెస్టు చేయరా...
-మంత్రుల కొడుకులకు ఒకన్యాయం ఇతరులకు ఒక న్యాయమా...
-వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలి
-హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే
వొడితెల సతీష్ కుమార్
చురకలు ప్రతినిధి కరీంనగర్ మే 11
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తూ ఆయన కొడుకు భగీరథ్ ఫోక్సో కేసును నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన భగీరథ్ పై బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అరెస్టు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యులపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. పోక్సో కేసు కాకుండా సాధారణ కేసు నమోదు చేసి కేసు మొత్తాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మంత్రుల కొడుకుల కైతే ఒక న్యాయం... ఇతరులకు మరొక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. వెంటనే బండి సంజయ్ కొడుకు భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో చట్టాలపై ప్రజలకు ఉన్న గౌరవం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. భగీరథ్ కేసులో ఇంకా జాప్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతామని సతీష్ కుమార్ హెచ్చరించారు.

