ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 45 ఏళ్లు......

ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 45 ఏళ్లు......

IMG-20260419-WA0018ఇంద్రవెల్లి... 
నెత్తుటి  మరకలకు 45ఏండ్లు....        ---ఆదివాసులకు అండగా నిలిచిన పోరకల   దొరలు..                  భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాటన రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో 1981 ఏప్రిల్ 20న కదం తొక్కడంతో జనసంద్రంతో సభ నిండుకున్నది.అక్కడ చేరుకున్న పోలీసులలో ఒక కానిస్టేబుల్ ఆదివాసి మహిళను అనుచితంగ ప్రవర్తించడంతో ప్రాణానికన్నా శీలం ముఖ్యమని భావించే ఆమహిళా చేతులో ఉన్న కొడవలితో దాడి చేయడంతో పోలీసులు రెచ్చిపోయి జరిపిన కాల్పుల్లో గోండు ప్రజలు లెక్కలేకుండా చనిపోయారు. ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసుల కాల్పుల సంఘటనలో ఆదివాసుల హక్కులు ప్రపంచానికి తెలియడమే కాకుండా మరో జలియన్ వాలాబాగ్ గా చరిత్రగా నిలిచింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరీ గ్రామంలో భూస్వాములపై ఆదివాసీ రైతులు తిరుగుబాటుతో వెలుగులోకి వచ్చిన  వారి ఉద్యమం శ్రీకాకుళం చేరుకొని భూమి భుక్తి  విముక్తి కోసం రైతంగ పోరాటాలకు ఊపిరి పోసింది. కరీంనగర్ జిల్లాలో విద్యార్థి రైతాంగా పోరాటాల స్ఫూర్తితో జగిత్యాల జైత్రయాత్ర  సాగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు (గోండు గిరిజనులకు)అండగా నిలిసింది. అర్ధ ఆకలితో బతుకు వెల్లదీసిన గోండులు ఆకలి,ఆనారోగ్యం బారిన పడి ప్రాణాలు కాపాడే వారు లేక దిగజారుతున్న బతుకులకు దిక్కు లేకపోవడం కుంగు బాటుకు గురి చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా విస్తరించిన అడవిలో వ్యాపారులు పటేల్ పట్వారి వ్యవస్థ చేస్తున్న, ఆగడాలు, దోపిడికి, ఆదివాసులు గురికావడంతో దిక్కులేక దిగులు పడుతున్న తరణంలో 1974 సంవత్సరం లలో అడుగుపెట్టిన అన్నల(పొరకలసార్లు)  ఆధ్వర్యంలో ఆదివాసులకు అండగా ఉండడం తో ఆకుల కల్లాలపై ఆదివాసుల పెత్తనం పెరగడం తో  పీపుల్స్ వార్ ( ప్రజల యుద్ధం )ఆధ్వర్యంలో రైతు కూలి సంఘం  ఉధ్యమించడంతో  ఆదివాసులు పిలుచుకునే పొరకల దొరల అండతో అడవి పై భూమిపై మాదే హక్కు అంటూ జిల్లాలో పోడు భూములను దున్నుకోవడం ఉద్యమించసాగారు. వేలాది ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న పెత్తందారుల పెత్తనం కోల్పోయిన పాలకులు పటేల్  పట్వారిలకు,ప్రభుత్వంకు కంటి నిండ కునుకు లేకుండా పోయింది.  
జల్-జంగిల్-జమీన్ ఆదివాసీలు తమ భూములు, అడవి, హక్కుల కోసం  ఉద్యమించారు. సీపీఐ యంఎల్ "పీపుల్స్ వార్ ( ప్రజలయుద్ధం) ఆధ్వర్యంలోని గిరిజన రైతు కూలీ సంఘం, ఆదివాసీలకు భూమి పట్టాల కోసం భూస్వాముల భూమి ఆక్రమణలను నిరసిస్తూ ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేసింది.
అడవిపై హక్కుల కోసం ఆదివాసీలు ఈ సభకు పెద్ద సంఖ్యలో ఆదివాసీలు విల్లు, బాణాలు, కర్రలతో  తరలివచ్చారు. 

1981 ఏప్రిల్ 20 న ఆదివాసీలు నిరసన తెలుపుతుండగా పోలీసులు సభపై కాల్పులు జరిపారు. ఒక కానిస్టేబుల్‌ను చంపారని అందువల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసుల ఆరోపణ..
అమరులైన గిరిజనులు  ఘటనలో అధికారికంగా 13 మంది ఆదివాసీలు మరణించినట్లు ప్రకటించారు, కానీ అనధికారికంగా వందల మంది చనిపోయారని, చాలా మంది ఆదివాసీలు అడవుల్లోకి పారిపోయారని, కొందరు చనిపోగా వారి మృతదేహాలను కూడా పోలీసులు దహనం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
సభ  ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్  సభలపై నిషేధం విధించారు, సభ విజయవంతం కోసం ఆదివాసులు అధిక సంఖ్యలో సభకు తరలి వచ్చినారు. 

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా మేధావుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆదివాసీల భూ హక్కుల పోరాటాన్ని అణచివేయడానికి ఈ కాల్పులు జరిపారని విమర్శలు వచ్చాయి.
ఘటన జరిగిన చోట ఆదివాసీల అమరవీరుల స్థూపాన్ని  నిర్మించారు, దీనిని పోలీసులు 1986లో కూల్చివేసి, తర్వాత ప్రజా నిరసనలకు తలొగ్గిన  ప్రభుత్వం స్థూపాన్ని నిర్మించడానికి ఒప్పుకొంది. 
  ఈ ఘటన జరిగి నేటికీ 45 ఏళ్లు,  ఆదివాసీ ప్రజలకోసం చేసిన త్యాగాలకు ప్రతీకగా దూరం ప్రాంతాలనుండి చుట్టు గ్రామాల నుండి జాతర లాగ ప్రజలు ఎడ్ల బండ్ల పై  ఇంద్రవెల్లికి వచ్చిస్తూపం వద్ద ప్రతి ఏట అమరుల త్యాగాలను ఎత్తి పట్టుతు చుట్టు ప్రాంతం ప్రజలు నివాళులు అర్పిస్తారు...................................   *బాలసాని రాజయ్య*                        *సినియర్ జర్నలిస్ట్* 9866102315...
 బాలసాని రాజయ్య                         సీనియర్ జర్నలిస్ట్ పెద్దపల్లి. 9441970025IMG-20260419-WA0017

Tags: