ఆగిన గడియారం, మోగని గంటలు
*ఆగిన గడియారం, మోగని గంటలు జగిత్యాల క్లాక్ టవర్*
గత చరిత్రకు ఆనవాళ్ళుగా నిలిచే క్లాక్ టవర్ గడియారం మసక భారుతుంది.
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన రజతోత్సవ ఉత్సవాల సందర్బంగా అప్పటి చల్ గల్ రాజ ధర్మ జలపతి రావు గారు 1936 లో క్లాక్ టవర్ నిర్మించారు.అప్పటి సమయంలో జర్మనీతో మిత్రుత్వం ఉన్నకారణంగా జర్మనీ నుంచి వాచులను తెప్పించి టవర్ లో అమర్చారు.
క్లాక్ టవర్ నిర్మించినప్పుడు నాలుగు వైపులా కనపడేలా అన్నివైపులా కిలోమీటర్ రోడ్ల నిర్మాణం జరిగింది.LG రాం లార్జ్ వద్ద కమాన్ కూడా ఉండేది దాన్ని తొలగించినట్లు పూర్వికులు చెపుతారు.క్లాక్ టవర్ నిర్మించినప్పుడు ఆ స్థలాన్ని (బొడ్డుచావిడి) అని పిలిచేవారు.
అప్పటి సమయంలో దాని గంటల సౌండ్ 3 కిలోమీటర్ల వరకు వినవచ్చేవి.ఆ టవర్ లోనే కొన్ని ఏండ్లు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది.
క్లాక్ టవర్ నిర్మిస్తున్న సమయంలో అప్పటి చట్టం ప్రకారం దాని చుట్టుప్రక్కల టవర్ కంటే ఎత్తయినా కట్టడాలు నిర్మించకూడదు.
ధర్మజలపతి గారు కట్టిన ఈ క్లాక్ టవర్ ను చూసి మూగ్దుడై ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ధర్మ జలపతి రావు గారికి బహుమతిగా వెండితో చేసిన క్లాక్ టవర్ ను బహుమతిగా ఇచ్చారు. ఇప్పటికి వారి కుటుంబ సభ్యులవద్ద ఉంది.
క్లాక్ టవర్ కట్టిన తర్వాత అందులోని గడియారం 50,60ఏండ్లు నిరంతరంగా నడిచింది.కాలక్రమేణా క్లాక్ టవర్ శిధిలమైతూ వచ్చింది. పాలకులు పట్టించుకోలేదు.
ఇట్టి విషయాన్నీ నేను అప్పటి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ (RDO) హన్మంత్ రావు గారికి విన్నవించాను. వెంటనే స్పందించి 2 ఏండ్ల ఎగ్రిమెంట్తో టవర్ లోని గడియారం రిపేరు చేయించి అందుబాటులోకి తెచ్చారు.
మళ్ళీ కొద్దిరోజులకు గడియారం ఆగిపోయింది.క్లాక్ టవర్ కట్టడం కూడా పెచ్చులూడుతుంది. శిదిలమవుతున్న టవర్ విషయంలో మళ్ళీ అప్పటి మున్సిపల్ చేర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకవెళ్ళాను.ఇట్టి విషయాన్ని వెంటనే కౌన్సిల్ పెట్టి ఆమోదం పొందారు.
ఆమోదం పొందిన వెంటనే JNTU నుంచి పురావాస్తు ఇంజనీర్ నిపుణులను పిలిపించి కొటేషన్ చేయించి, వెంటనే పనులు ప్రారంభించి క్లాక్ టవర్ ను అందంగా తీర్చిదిద్ది గడియారం నడిపించారు.
మళ్ళీ కొన్ని ఏండ్లుగా పాలకులు పట్టించుకోక గడియారం నడువక గంటలు మొగక శిదిలావస్థకు గురిచేస్తున్నారు.
ఇట్టి క్లాక్ టవర్ గడియారం బహిరంగ మార్కెట్లో దాదాపు కోటి విలువ చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని పురాతన క్లాక్ టవర్ గడియారంలు పనిచేస్తుంటే,అందులో చార్ మీనార్ గడియారం 135 ఏండ్లుగా నిరంతరంగా ఈరోజు వరకు పనిచేస్తుంది. మరి ఒక్క జగిత్యాల క్లాక్ టవర్ గడియారం ఎందుకు పనిచేయడం లేదు.
ఇప్పటికైనా పాలకులు గత చరిత్ర మసక పోకుండా క్లాక్ టవర్ గడియారం పూర్తిస్థాయిలో నిశ్నతులతో మరమ్మత్తులు చేయించి జగిత్యాల ఈతరం ప్రజలకు అప్పటి గడియారం ఎలాఉందో, అప్పటి టెక్నాలజీ ఎలా ఉందో చూపించి కనువిందు చేయాలనీ కోరుతూ
బాస ప్రకాష్. జగిత్యాల

