మాల్టాలో రోడ్డు ప్రమాదం... జగిత్యాల యువకుడు మృతి
By: Mohammad Imran
On
మాల్టాలో రోడ్డు ప్రమాదం... జగిత్యాల వాసి మృతి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఆగస్టు 11: యూరప్ లోని మాల్టాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన జావీద్ అబ్దుల్లా(27) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు పావోలా ప్రాంతంలో నివసిస్తునట్లు తెలిసింది. ఈ ప్రమాదం ఖోర్మి పట్టణంలోని త్రిక్ తల్-హండాక్ వద్ద ఉదయం జరిగిందని, మృతుడు నడుపుతున్న టయోటా టోయేస్ వాహనం, లారీలు ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సివిల్ ప్రొటెక్షన్ సిబ్బంది, వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జావీద్ అబ్దుల్లాకు గత మార్చిలో వివాహం అయింది. ఈ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Tags:

