విద్యార్థుల కఠిన శ్రమతోనే ఉత్తమ ఫలితాలు, ఆల్పోర్స్ చైర్మన్ వి, నరేందర్ రెడ్డి
విద్యార్థుల కఠిన శ్రమతోనే ఉత్తమ ఫలితాలు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 14 : విద్యార్థుల కఠిన శ్రమ, అధ్యాపకుల సరైన మార్గనిర్దేశనంతో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అల్ఫోర్స్ కళాశాలలో ఇటీవలే విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థులను డా. నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం.పి.సి, బై.పి.సి, సి.ఈ.సి, ఎం.ఈ.సి విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారన్నారు. ఎంపిసి ఫస్ట్ ఇయర్ జీ స్నేహిత, 468/470, రాచర్ల ఆశ్విత వర్మ,- 468/470, తుమ్మనపల్లి సహస్ర- 468/470, లవంగ శ్రీజ- 468/470 మార్కులతో మొదటి స్థానంలో నిలువగా సహస్ర 467/470 జోసెఫ్ 467/470 మరియమ్, 467/470, టి. అప్తిచంద్ర 467/470 మార్కులు సాధించారు. ఎంపిసి సెకండ్ ఇయర్ లో లహరి సందరికారి -995/1000- మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, నవ్య పల్లికొండ 994, లాస్య రెడ్డి గోగురి 993 మార్కులు సాధించారని తెలిపారు. బైపిసి విభాగం సెకండ్ ఇయర్ అన్సా హురియా 994/1000, సోబియా తస్నీమ్ 994/1000, రీష ఫాతిమా 993/1000 మార్కులతో సత్తా చాటారు. బైపిసి ఫస్ట్ఇయర్ అల్మాస్ ఫాతిమా -438/440- శ్రీలక్ష్మి 437/440 మార్కులు, ఎల్ శ్రీలక్ష్మి 437/440, హనఫా హననియా 436 / 440, నబియా నౌసిన్ 436/440, సఫరా జుఫీషా 436/440, ఏం అక్షయ 436/440, మార్కులు సాధించారని, సిఈసి విభాగం ఫస్ట్ ఇయర్ లో అన్నం మెహరోజ్ -494/500, డి వైష్ణవి 491/500, కే శ్రీ వర్ష 488/500, కే ప్రణీత 488/500 అత్యుత్తమ ప్రతిభ కనబరచగా, సిఈసి సెకండ్ ఇయర్ లో బావజ్ఞ పెల్లె -987– ఎండి సంసియా 984/1000, మౌనిక 984/1000, అర్పాత్ అనీమ్ 983 / 1000 మార్కులు సాధించారన్నారు. ఎంఈసి సెకండ్ ఇయర్లో నిస్మా తబస్సుమ్ 980/1000 మార్కులతో ఘన విజయం సాధించారన్నారు.

