సూర్య గ్లోబల్ స్కూల్ లో స్పోర్ట్స్ మీట్
సూర్య గ్లోబల్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. చిన్నప్పటి నుంచే చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధిస్తూ ముందుకు సాగితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించే అవకాశం ఉంటుందని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేష్, స్థానిక సర్పంచ్ దావ తిరుపతి, పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు, హరిచరణ్ రావు, మౌనిక రావు, హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు.

