సర్ లో బి ఎల్ వో లకు ఎడిట్ అప్షన్
*🔊‘సర్’లో బీఎల్‌వోలకు ఎడిట్ ఆప్షన్*
*🔶డిజిటలైజేషన్ తర్వాత తప్పుల సవరణకు వీలు*
*🔷ఈ నెల 10 వరకు అవకాశం*
*🍥ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్‌లో ఏమైనా తప్పులు దొర్లితే సరి చేయడానికి బీఎల్‌వోలకు ఎన్నికల సంఘం ఎడిట్ ఆప్షన్‌ను కల్పించింది. ఈ నెల 10 వరకు ఇది పని చేస్తుంది. ఓటర్లు ఏమైనా తప్పుడు సమాచారంతో పత్రాలను అందించామని భావించినా.. బీఎల్‌వోలు పొరపాటున ఆన్‌లైన్‌లో తప్పుడు వివరాలు నమోదు చేసినా.. ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిదిద్దవచ్చు. పేరులో అక్షర దోషాలు వంటివాటితోపాటు, ఎస్‌ఐఆర్-2002కు సంబంధించిన వివరాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తిస్తే బీఎల్‌వోల వద్దకు వెళ్లి ఓటర్లు సరి చేసుకోవచ్చు.*
*🌀సాధారణంగా ఎన్యూమరేషన్ ఫారాల్లో తప్పులు రాస్తే.. వాటినే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆగస్టు 17 తర్వాత అలాంటి ఓటర్లకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎన్నికల సంఘం పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ఎదురుకాకుండా లోపాలను గుర్తించి ఎడిట్ ఆప్షన్‌తో సరిచేసుకోవచ్చు.*
*💥‘అనామలీస్’ ఓటర్లకూ అవకాశం*
*💠షెడ్యూల్‌కు ముందే అధికారులు ఎస్‌ఐఆర్-2002తో ప్రస్తుత ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో సుమారు 80 లక్షల మంది అనామలీస్‌గా (వివరాల్లో కొన్ని తేడాలున్నట్లు) గుర్తించారు. అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు కూడా ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకునే అవకాశం ఉంది. ఎడిట్ ఆప్షన్ ద్వారా సవరణ చేసినప్పటికీ అందులో భారీ తేడాలను, అనుమానాలను అధికారులు గుర్తిస్తే మాత్రం నోటీసులు అందుతాయి.*
*🥏రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియలో భాగంగా 55 లక్షల మంది ఓటర్లను ‘అన్ కలెక్టబుల్’ (చిరునామాలో లేనివారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్లు, చనిపోయినవారు)గా గుర్తించారు. అయితే బీఎల్‌వోలపై లక్ష్యం పూర్తిచేయాలని ఒత్తిడి తీసుకురావడంతో ఫారాలు పంపిణీ కాని.. ఆచూకీ లభ్యం కాని ఓటర్లను ఈ జాబితాలో చేర్చినట్లు విమర్శలున్నాయి. తర్వాత ఆ ఓటర్లు పత్రాల కోసం బీఎల్‌వోల వద్దకు వస్తుండటంతో జరిగిన పొరపాట్లను ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసే వీలుంది.*
*🛟తప్పులు దొర్లాయని భావించి ఎవరైనా ఓటర్లు బీఎల్‌వోల వద్దకు వస్తే వారికి సహకరించాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లకు ఎడిట్ ఆప్షన్‌పై సమాచారం లేదు. కొన్నిచోట్ల తెలిసినా బీఎల్‌వోలు సహకరించడం లేదు. దీనిపై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సైతం ఎన్నికల అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.*

