ఉద్రిక్తంగా మారిన ఏ బి వి పి ఆందోళన
By: Mohammad Imran
On
ఉద్రిక్తంగా మారిన ఏ బి వి పి ఆందోళన
జగిత్యాల
జగిత్యాలలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది… కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు రోడ్డెక్కారు… ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ… రాష్ట్రంలో మద్యం శాఖకు మంత్రి ఉన్నప్పటికీ, విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు… తక్షణమే బకాయిలను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు… పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు…
Tags:

