దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి

 దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి

దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి 

జగిత్యాల , జూన్, 09IMG-20260609-WA0001

దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు ఉండగా అందులో జగిత్యాల జిల్లా వాసులు ఉన్నారు.
దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురికి సాధారణ వార్డులో చికిత్స అందిస్తుండగా వీరిలో హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సయీద్ కూడా ఉన్నారు. ఇక విషమ పరిస్థితుల్లో ఉన్న ఐదుగురిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియలేదు.
మృతులు ముగ్గురూ కూడా జగిత్యాల జిల్లాకు చెందిన వారేనని ప్రాథమిక సమాచారం.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం (51), మల్యాల మండలం తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన గొల్లపలి తిరుపతి గౌడ్ (42), మెట్ పల్లి మండల కేంద్రంలోని గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీఖ్ (37)లు ఈ ప్రమాదంలో మరణించారు. మృతదేహాలను భారత్‌కు పంపించడానికి దుబాయిలోని భారతీయ కాన్సులేటు అధికారులు మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
  బాధితులను దుబాయిలోని సామాజిక కార్యకర్త గుండెళ్లి నరసింహ కూడా పరామర్శించారు.
షార్జా కేంద్రంగా ఉన్న ఒక అల్యూమినియం డోర్ ఫ్రేం, గ్లాసుల పరిశ్రమలో వీరందరు పని చేస్తున్నారని తెలిసింది. అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో రోడ్డుపై ఆగిపోయిన లారీని వెనక నుంచి వచ్చి మినీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని

Tags:

Related Posts