క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
వీణవంకలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
=యువత క్రీడల్లో రాణించాలి - ఎస్ఐ ఆవుల తిరుపతి
చురకలు విలేఖరి వీణవంక మే 15:
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వేసవి కాలం సందర్భంగా యువత కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.శివాజీ యూత్ క్లబ్,8వ వార్డు సభ్యులు భోగం అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు స్థానిక ఎస్ఐ ఆవుల తిరుపతి, సర్పంచ్ దాసారపు సరోజన ముఖ్య అతిథులుగా హాజరై, టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి మాట్లాడుతూ.. యువతకు క్రీడల పట్ల ఉండాల్సిన ఆసక్తినీ కనబరచాలీ.యువత ఖాళీ సమయాల్లో చెడు దారులకు మళ్ళకుండా ఉండాలంటే క్రీడలు ఎంతో దోహదపడతాయి. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవడుతాయి. గ్రామంలో యువత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన 8వ వార్డు సభ్యుడు భోగం అనిల్‌ను ఆర్గనైజర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
సర్పంచ్ సరోజన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్
తాళ్లపల్లి మహేష్,మాజీ ఉపసర్పంచ్ వోరెం భానుచందర్,వార్డు సభ్యులు నీల శ్రీకాంత్, కుమార్,
పంచాయతీ కార్యదర్శి యశోద,స్థానిక క్రీడాకారులు గ్రామ యువత పాల్గొన్నారు.

