రైస్ మిల్లు యాజమాని పై కేసు నమోదు
రైస్ మిల్లుల యాజమాని పై కేసు నమోదు
చురకలు విలేఖరి
జగిత్యాల, జూలై, 31
విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ బసవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సివిల్ సప్లై అధికారి ఎస్ జితేందర్ రెడ్డి మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జగిత్యాల జిల్లాలోని శ్రీ అభయాంజనేయ సాయి రైస్ మిల్, శ్రీ లక్ష్మీ బాలాజీ ఇండస్ట్రీస్ మరియు లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ లలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సిఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు విజిలెన్స్ అధికారుల ప్రాథమిక విచారణ మరియు తనిఖీల అనంతరం సుమారు 87 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు నిర్ధారణ అయినది ఈ అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లుల యాజమాన్యాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు.మిల్లు యజమాని కొండ లక్ష్మణ్ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

