కాంగ్రెస్ పార్టీ లో కొనసాగే పరిస్థితి లేదు. జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ లో కొనసాగే పరిస్థితి లేదు. జీవన్ రెడ్డి

కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదు..

25 న అభిమానులు..శ్రేయోభిలాషులతో సమావేశం.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ..

నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం నాకు బాధాకరమే.

శాసన మండలి లో ఒంటరి పోరాటం చేసిన..
అధికారం లో ఉన్న ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసిన..

తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణం జాప్యం తో తెలంగాణ రాష్ట్రం పై తీవ్ర ప్రభావం..

మాజీ మంత్రి జీవన్ రెడ్డి..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

20 మాసాల  నుండి జగిత్యాల లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి కల్పించాయి.

నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగటం సాధ్యం కాదు అని అభిప్రాయానికి వచాను..

నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవ బాధాకరం..

అది నుండి ప్రజల పక్షం నిలబడి
అధికార పార్టీ లో ఉండి  కూడా పోరాటం చేసిన.

ఉమ్మడి రాష్ట్రంలో వై ఎస్ రాజశేకర్ రెడ్డి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా రూ.5000IMG-20260322-WA0056 చెల్లిస్తామని హమీ ఇచి, జగిత్యాలలో అమలు చేయకపోవడంతో రైతులకు ప్రోత్సాహకం అందించాలని మంత్రి గా ఉండి కూడా ధర్నా చేసిన అని గుర్తు చేసిన.

ఎలెక్ట్రిసిటీ అదనపు బిల్లు ఉపసంహరించాలని ఎమ్మెల్సీగా ఉండి కూడా ఉద్యమించిన.

నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో
శ్రీధర్ బాబుతో అనుబంధం తో మాట్లాడారు.

నా సమస్యకు ఎవరి వద్ద పరిష్కారం లేదు..

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని సూచించాను.

ప్రతిపక్ష పార్టీ గా దశాబ్ద కాలంగా పని చేసి, అధికారం వచ్చిన తర్వాత మా హక్కులు కాలారాస్తుంటే ఎంతకాలం భరించాలి.

కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు దారులు పార్టీ నీ నడిపిస్తున్నారు.

రాజకీయమే గౌరవం కోసం.. ఆ గౌరవం లేకపోవడంతో పార్టీ లో కొనసాగటం వల్ల ప్రయోజనం ఏమిటి..

నా పరిస్థితి వివరించిన తర్వాత శ్రీధర్ బాబు కూడా సమాధానం చెప్పలేకపోయారు.

జగిత్యాలలో కాంగ్రెసు ను ఐక్యంగా నిలపడానికి ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు అండగా నిలవడంతో ఈ స్థాయిలో ఎదిగిన.

టీడీపీ పాలనలో సైతం లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

2014 లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాం.

ఓడిన ఎన్నడూ నాకు ఓటమి అనే భావన రాకుండా..కార్యకర్తలు.. అభిమానులు.. 

మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల హక్కుల కోసం పోరాటం చేసిన.

నాలో అసహనం పెరుగుతుంది..

ప్రత్యర్థి పై పోరాటం చేయటం...సహజం కానీ
సొంత పార్టీ పై పోరాటం చేయటం ఎంత బాధాకరం..

మున్సిపల్ ఎన్నికల్లో నేను ప్రతిపాదించిన వారికి టిక్కెట్లు వచ్చిన వారికి ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోయిన..

కాంగ్రెస్ లో కొనసాగటం సరి కాదని, వైదొలగాలని అభిప్రాయానికి వచ్చిన.

25 న స్థానిక బండారి గార్డెన్ లో రాజకీయ సహచరులు, అభిమానులు, శ్రేయోభిలాశులతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం..

 రాష్ట్ర నాయకత్వం అధిష్టానం పై నెట్టివేస్తున్నారు.

నాకు అన్యాయం జరగడంలో ఎమ్మెల్యే పాత్ర సైతం ఉంది..

తెలంగాణకు ఆధారం ప్రాణహిత నది.

ప్రాణహిత నీరు వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవాలని తుమ్మడి హేట్టి వద్ద నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.

ఆదిలాబాద్ నుండి రంగారెడ్డి వరకు త్రాగు నీరు, సాగు నీరు పారిశ్రామిక అవసరాలకు ఆధారం ప్రాణహిత..

తుమ్మడి హేట్టి జాప్యం తో ఉత్తర తెలంగాణ కరువు తలెత్గే ప్రమాదం ఉంది.

ఇంత వరకు మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టడం లేదు..

కాంట్రాక్టర్ మరమాతు పనులు చేపట్టకపోతే ప్రభుత్వమే చేపట్టి, కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు..

తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణం ఎన్నికల్లో మేనిఫెస్టో లో పేర్కొన్నారు.

ప్రజాహిత అంశాలు విస్మరించడం ఎంత వరకు సమంజసం.

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పై ప్రభావం చూపుతుంది.

మంత్రిగా నాకు అర్హత ఉంది .
.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా..మండలి లో ఒంటరి పోరు చేసిన..

 రేవంత్ రెడ్డి.. భట్టి విక్రమార్క లా నేను నా స్థాయిలో పోరాటం చేసిన.
నా సంయమనానికి పరిమితి ఉండదా..

ప్రజాస్వామ్యంలో నా స్వేచకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్న.. 
25 నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం..

జగిత్యాల తో నా అనుబంధం ఎవరు తెంచలేరు.. నా చివరి శ్వాస వరకు జగిత్యాల తో అనుబంధం కొనసాగుతుంది.

Tags: