ఈద్ సమీపిస్తున్న అందని ఈద్ తోఫాలు...
ఈద్ సమీపిస్తున్న.. అందని ఈద్ తోఫాలు..
గిఫ్ట్ ప్యాక్ లు ... ఇఫ్తార్ పార్టీలకు దిక్కేలేదు...
కార్యాలయాల్లో మగ్గుతున్న గిఫ్ట్స్ ప్యాక్ లు .
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 12 : ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మైనార్టీ శాఖ ద్వారా చేపడుతున్న రంజాన్ గిఫ్ట్ ప్యాక్ పంపిణీ, ఇఫ్తార్ పార్టీలపై పాలన యంత్రాంగం రంజాన్ పండుగ సమీపిస్తున్న ఇంత వరకు ఏలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల మైనార్టీ వర్గాల్లో ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వెనుకబడిన ముస్లింల కోసం గిఫ్ట్ ప్యాక్ 1 చీర, 1చూడీదార్, 1 కుడ్తా పైజామా అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 4న ఈద్ తోఫా కార్యక్రమాన్ని ప్రారంభించగా, రూ.2 కోట్ల 66లక్షల రాష్ట్రంలో ఈ పథకం అమలులోకి వచ్చింది. అయితే జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల కోసం ఒక్కో నియోజకవర్గానికి సుమారుగా 4వేలకు పైగా గిఫ్ట్ ప్యాక్లు అవసరం ఉండగా, ఈ ఏడాది వాటిలో సగం కేటాయించినట్లు, జిల్లాలోని నియోజకవర్గాల్లో ఈద్ తోఫాలను మైనార్టీలకు అందించాల్సి ఉండగా ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రభుత్వ గోదాంలో ఈద్ తోఫాలు మగ్గుతున్నాయి. మరో వారం రోజుల్లో రంజాన్ పండుగ ఉన్న నేపథ్యంలో ఇప్పటికి రంజాన్ గిఫ్ట్స్ ప్యాక్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీకి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దారిద్రరేఖకు దిగువు ఉన్న మైనార్టీలు ప్రభుత్వం ప్రకటించిన రంజాన్ తోఫా కోసం కార్యాలయాల, ప్రజాప్రతినిధుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 813 మసీదుల్లో ఇఫ్తార్ విందుల నిర్వహణకు నిధులు విడుదల చేయగా, మరో వారం రోజుల్లో పవిత్ర రంజాన్ నెల ముగియనున్న నేపథ్యంలో ఇఫ్తార్ విందుల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టకపోవడం పట్ల పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.
విందుల ఏర్పాట్లలో గ్రూపులు....
ఇఫ్తార్ పార్టీల ఏర్పాటు ప్రభుత్వ అధికారులు, మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించల్సి ఉండగా ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు పార్టీల బాధ్యతలు అప్పగించాలని హుకుం జారీ చేయడం తో అధికారులు నిధులు డ్రా చేసి ప్రజాప్రతినిధులు సూచించిన వారికే అప్పగిస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి.

