ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణగూడలోని తాజ్ మహల్ హోటల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 50 మంది సభ్యులు హాజరయ్యారు. సమాజ సేవలో విశేష కృషి చేసిన మహిళలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ ఆక్టివిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ డి మౌనిక మాట్లాడుతూ సమాజ సేవలో నిరంతరం కొనసాగాలంటే మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరమని అన్నారు. వేడుకలకే పరిమితం కాకుండా వృద్ధుల సంక్షేమం కోసం ఈ వేదిక ద్వారా అసోసియేషన్ ప్రభుత్వానికి కొన్ని కీలక డిమాండ్లను సమర్పించింది. అత్యవసర పరి స్థితుల్లో వృద్ధులకు ప్రభుత్వ అతిథి గృహాల్లో తక్షణ వసతి కల్పించాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వృద్ధులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా వృద్ధుల సహాయనిధిని ఏర్పాటు చే యాలి. స్థానిక పరిపాలనలో ముఖ్యంగా జీపీలు, మున్సిపాలిటీలలో వృద్ధులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. తద్వారా వారి సమ స్యలు విధాన నిర్ణయాల్లో ప్రతిబింబిస్తాయి. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కన్వీనర్ కృతజ్ఞతలు తెలుపుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, వృద్ధుల గౌరవాన్ని కాపా డటం కోసం అసోసియేషన్ ఎల్లప్పుడూ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీఐ ప్రెసిడెంట్ లక్కం రాజ్యలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ కుందారపు లావణ్య, కర్నాల విజయ, కుందారపు గంగాధర్, గ్రామ సర్పంచ్ నల్ల కవితా స్వామి రెడ్డి, ఉప సర్పంచ్ ఎడమల లావణ్య సత్తయ్య, అన్నపూర్ణ మండల సమాఖ్య అధ్యక్షులు మారు సత్తవ్వ, ఆశా వర్కర్లు తరుణి, లతా శ్రీ, రాజేశ్వరి, గ్రామ సంఘం పాలకవర్గ సభ్యులు నల్వాల మానస, పడిగేల జ్యోతి పాల్గొన్నారు.

