అల్పోర్స్ మల్యాల లో ఘనంగా ముందస్తు బోనాల ఉత్సావం
*మల్యాల ఎక్స్ రోడ్
అల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా ముందస్తు బోనాల పండుగ ఉత్సవం*
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని ఈ పండుగకు చాలా విశిష్టత ఉన్నదని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు మల్యాల ఎక్స్ రోడ్ లో గల అల్ఫోర్స్ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ ముందస్తు బోనాల జాతర ముఖ్యఅతిథిగా హాజరై ముందుగా చేసి శ్రీ నవదుర్గ చిత్రపటానికి ఉత్సవాలను ప్రారంభించారు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి కార్యక్రమానికి బోనాలను సమర్పించి ఆయురారోగ్యాలతో అవలంబిస్తున్న ఈ ఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగించడం చాలా శుభ పరిణామం అని పేర్కొన్నారు బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో సైతం బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన ఉండాలని కోరుకుంటూ తమ ప్రేమ ఆప్యాయతలను పూలమాల వేసి చూపిస్తున్నారు మతాలకు అతీతంగా బోనాల పాల్గొన్నారు ఈ సందర్భంగా పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం నరేందర్ రెడ్డి ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటితరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత అని ఆయన అన్నారు, విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓ తల్లి మైసమ్మ పోచమ్మ తెచ్చామమ్మ బోనం అమ్మ బోనమే మా దైవం నృత్యాలు అందర్నీ ఆకర్షింప చేశాయి సుమారు 50 మంది విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

