గల్ఫ్ జనసేన యు. ఏ ఇ, అండ జగిత్యాల కార్మికునికి సహాయం

గల్ఫ్ జనసేన యు. ఏ ఇ, అండ  జగిత్యాల కార్మికునికి సహాయం

గల్ఫ్ జన సేన యూఏఈ అండ.. జగిత్యాల కార్మికుడికి సహాయం

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఆగస్టు 21 : దుబాయ్ లో ఏజెంట్ మోసానికి గురైన జగిత్యాల జిల్లాకు చెందిన కుంచెపు ఎల్లయ్యకు గల్ఫ్ జన సేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీమ్ సహాయం అందించింది. ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎల్లయ్యకు వసతి కల్పించడంతో పాటు, వీసా క్యాన్సిలేషన్ ప్రక్రియలో అవసరమైన సహాయం అందించారు. అంతేకాకుండా, విమాన టికెట్ను కూడా ఏర్పాటు చేసి స్వదేశానికి సురక్షితంగా చేరుకునేందుకు సహకరించారు. కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల కార్మికులకు అండగా నిలవడం గల్ఫ్ జన సేన ప్రధాన బాధ్యత అని గల్ఫ్ జనసేన యూఏఈ ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు పేర్కొన్నారు. గల్ఫ్ జనసేన నేషనల్ కన్వీనర్ మొగళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవాసాంధ్రులకు గల్ఫ్ జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఎల్లయ్య గల్ఫ్ జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీమ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.IMG-20260821-WA0169

Tags: