మజీద్ ఏ హాజారి కమిటీ నియామకం
మసీద్-ఎ-హజారీ కమిటీ నియామకం.
జగిత్యాల, అక్టోబర్ 11:
జగిత్యాల జిల్లా కేంద్రంలోని హజారి మహల్లాలో ఉన్న అషూర్ ఖానా, మసీద్-ఎ-హజారీల నిర్వహణకు మేనేజింగ్ కమిటీని నియమిస్తూ ఆదివారం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జనాబ్ మహ్మద్ అసదుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు ప్రొసీడింగ్స్ నెం. 01/జెజిటీవైఎల్/ఎంసీ/2025/జడ్-IV, తేదీ 29-09-2026 ప్రకారం మహ్మద్ అబ్దుల్ మోహ్సిన్ దరఖాస్తు మేరకు, వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్, సర్వేయర్ నివేదిక ఆధారంగా, చైర్మన్ ఆదేశాలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వక్ఫ్ చట్టం 1995 సెక్షన్ 18 ప్రకారం ఏడాది కాలానికి (బోర్డు రాటిఫికేషన్ కు లోబడి) ఈ కమిటీని నియమించారు. 6 నెలల్లోగా అషూర్ ఖానాను పునరుద్ధరించాలని ఆదేశించారు. కాగా మహ్మద్ అబ్దుల్ మోహ్సిన్ ను అధ్యక్షులుగా, ఖాజా తాజుద్దీన్ ను ఉపాధ్యక్షులుగా, షేక్ అర్షద్ హుస్సేన్ ను కార్యదర్శిగా, మహ్మద్ అబ్దుల్ మాలిక్ ముకర్రం ను ప్రధాన కార్యదర్శిగా,
, మహ్మద్ ఖిజర్ ను కోశాధికారిగా నియమించారు. అషూర్ ఖానాతో పాటు దానికి అనుబంధంగా ఉన్న మసీదును కూడా కమిటీ నిర్వహించాలని, వక్ఫ్ రెగ్యులేషన్స్ 2009 ప్రకారం విధులు నిర్వర్తించాలని, ఉల్లంఘిస్తే వక్ఫ్ చట్టం 1995 సెక్షన్ 67 కింద చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

