మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణ కు జిల్లా పోలీసుల ప్రత్యేక చొరవ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణ కు జిల్లా పోలీసుల ప్రత్యేక చొరవ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

*మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు జిల్లా పోలీసుల ప్రత్యేక చొరవ.*

*మహిళా పోలీసుల ఆరోగ్యమే విధి నిర్వహణకు, కుటుంబ సంక్షేమానికి బలమైన పునాది.*

*మహిళా పోలీసులకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్‌*

జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, అధికారుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబానికి, సమాజానికి, పోలీసు శాఖకు మరింత సమర్థవంతంగా సేవలందించగలరన్నారు.

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారులకు సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, వ్యాధి నివారణ లక్ష్యంగా జగిత్యాల పట్టణంలోని ఐఎంఏ హాల్‌లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.


ఈసందర్భంగా మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ... పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, మహిళా పోలీసు సిబ్బంది కుటుంబ బాధ్యతలతో పాటు విధి నిర్వహణలోనూ విశేష సేవలందిస్తున్నారని అన్నారు. అలాంటి మహిళా సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరన్నారు.

మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈఅవగాహన,వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.సర్వైకల్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో ఒకటని, అయితే సరైన సమయంలో HPV వ్యాక్సిన్ తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని చాలావరకు నివారించవచ్చని తెలిపారు.మహిళలు ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.పోలీసు శాఖలో సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు  నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.


ఈసందర్భంగా వైద్య నిపుణులు సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, వ్యాధి నివారణ మార్గాలు, హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై మహిళా పోలీసు సిబ్బందికి వివరించారు. అనంతరం అర్హులైన మహిళా పోలీసు సిబ్బందికి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందజేశారు.

ఈకార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డా. గుడూరి హేమంత్, కార్యదర్శి డా. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డా. కోటగిరి సుధీర్ కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్.ఐ లు గీత, సుప్రియ వైద్య సిబ్బంది, మహిళా పోలీసు అధికారులు, మహిళా కానిస్టేబుళ్లు,
డా. పద్మిని
డా. జి. శ్రీలత
డా. మంగాదేవి
డా. అరుణ
డా. జయంతి తదితరులు పాల్గొన్నారు.IMG-20260707-WA0095

Tags: