మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ, కేసు నమోదు
By: Mohammad Imran
On
జగిత్యాల కమిషనర్ సంతకం ఫోర్జరీ...
పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్..
చురకలు ప్రతినిధి, జగిత్యాల, జూలై 8 : మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ ఇంటికి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఓ ఇంటిపై 52 వేల రూపాయల ఆస్తి పన్ను బకాయి ఉండగానే ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలిసిన వెంటనే కమిషనర్ జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు టౌన్ ఇన్స్ పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఫోర్జరీకి పాల్పడిన వారిపై, ఈ ప్రక్రియలో అధికారుల పాత్రపై విచారణ చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ సత్య ప్రణవ్ పేర్కొన్నారు.
Tags:

