ప్రతిభకనబరిచిన పోలీసులకు ప్రశంస పత్రాలు అందజేసిన సిపి

ప్రతిభకనబరిచిన పోలీసులకు ప్రశంస పత్రాలు అందజేసిన సిపి

ప్రతిభ కనబర్చిన పోలీసులకు ప్రశంసా పత్రాలు 

చురకలు విలేఖరి 
కరీంనగర్ రూరల్, అక్టోబర్, 13


విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన కరీంనగర్ రూరల్ పోలీసులకు ప్రశంసా పత్రాలు
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో నిన్న నిర్వహించిన సమీక్షా కార్యక్రమంలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్  గౌష్ ఆలం  గుర్తించి అభినందించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ ఎ. లక్ష్మారెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు రవి, అంజయ్య, సాగర్, మహిళా కానిస్టేబుల్ కీర్తన తమ విధి నిర్వహణలో కనబరిచిన పనితీరును పరిగణనలోకి తీసుకొని, వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడం, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి అంశాల్లో పోలీసు సిబ్బంది చూపే నిబద్ధతను గుర్తించి ప్రోత్సహించడంలో భాగంగా ఈ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు.IMG-20261013-WA0104

Tags: