ప్లాస్టిక్ నిషేధానికి న్యాయవాది పోరాటం

*ప్లాస్టిక్ నిషేధానికి న్యాయవాది పోరాటం*

 

జగిత్యాల, ఫిబ్రవరి, 25

సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకంపై పూర్తిగా నిషేధం విధించాలని జగిత్యాలకు చెందిన న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఉద్యమం చేస్తున్నారు.మధుసూదన్ రెడ్డికి 2025 మే లో క్యాన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యుంది. అప్పటి నుండి 
బసవ తారకం హాస్పిటల్ లో చికిత్స చేసుకుంటు 
క్యాన్సర్ గూర్చి పోరాటం చేస్తున్నారు. సింగల్ యూస్ 
నిషేధం గూర్చి 
ప్రధాన మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఈ వ్యాధి బారిన ఇతరులు పడకుండా చర్యలు చేపట్టాలని, పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభం చేసారు. జగిత్యాలలోని విద్యాసంస్థలు, న్యాయవాదుల ద్వారా ఇప్పటికి పది వేల పోస్ట్ కార్డుల ద్వారా సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కోసం మధుసూదన్ ఉద్యమం చేస్తున్నారు.అయితే న్యాయవాది మధుసూదన్ చేస్తున్న ఉద్యమానికి స్థానికుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

Tags:

Related Posts