హోమ్ మెడ్ పేరుతో కస్టమర్లకు గుల్ల
జగిత్యాల పట్టణంలో హోమ్ మేడ్ పేరుతో కస్టమర్లను గుల్ల చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన నవీన్ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రాజు స్వీట్స్‌కి వెళ్లి, ఇంట్లో తయారు చేసిన తొక్కు అని నమ్మి ఒక కిలో రూ.180కి దొరికేదాన్ని రూ.400కు కొనుగోలు చేశాడు.
అయితే ఇంటికి చేరుకుని బాక్స్ ఓపెన్ చేసిన నవీన్‌కు షాక్. హోమ్ మేడ్ అని చూపించిన తొక్కుపై అసలు ఓ కంపెనీకి చెందిన సీల్ మార్క్ వుండటంతో మోసం బయటపడింది. బయట స్టిక్కర్‌ను తీసేసినప్పటికీ, లోపల ఉన్న సీల్‌పై ముద్రను తీసేయడం మాత్రం షాప్ యజ
మాని మర్చిపోవడంతో నిజం బయటకు వచ్చింది
బయట లభించే అదే కంపెనీ తొక్కును ఇంట్లో తయారు చేసినట్లు నటించి, భారీ ధరకు విక్రయించడం అసహ్యమని నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనలాంటి మరెవ్వరూ మోసపోకూడదని, భారీ బోర్డులు పెట్టి కస్టమర్లను మభ్యపెడుతున్న యజమానిపై అధికారుల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశరు.

