రెండవ విడిత పంచాయతీ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి ఎస్పీ అశోక్ కుమార్
*రెండవ విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*- - - ఎన్నికలు నిర్వహణకు 853 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.*
జిల్లాలో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి ని పటిష్ట పోలీస్ బందోబస్త్ మద్య తరలించడం జరిగిందని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూటు మొబైల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.రెండవ విడతకి సంబంధించి 1276 పోలింగ్ కేంద్రాలలో 134 సర్పంచ్ ,946 వార్డ్ లకు పోలింగ్ జరుగుతుంది అని దీనికి సంబంధించి (853 ) మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు అని అన్నారు. పటిష్ట ఎస్కార్ట్ తో పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుంది (57) రూట్స్ లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ మరియు ఎస్.ఐ లతో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఓటరు స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ప్రతి ఓటరు తమ ఓటు ను స్వేచ్ఛగా వినియోగించుకునే ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు . ఓటర్లు ఎవ్వరూ కూడా సెల్ ఫోన్ లు, మందుగుండు సామాగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, పోలింగ్ బూతు లోనికి తీసుకువెళ్లారాదని, సెల్ఫీలు దిగడం నిషేదం అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తామన్నారు.
ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉందని కావున విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే లు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అన్నారు. MCC అమల్లో ఉన్నందున ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని నియమాలను అతిక్రమించే ఏ చర్యనైనా సహించేది లేదని. ఉల్లంఘనలు జరిగితే వెంటనే చట్టపరమైన కేసులు నమోదు అన్నారు.

