అలయాలకు, ఆపదలో ఉన్నా వారికి' జాక్ పాట్ ' అజయ్

అలయాలకు, ఆపదలో ఉన్నా వారికి' జాక్ పాట్ ' అజయ్

ఆలయాలకు,ఆపదలో ఉన్నవారికి ‘జాక్ పాట్ అజయ్’

-సేవ కార్యక్రమాలతో 
-తన సొంత ఇంట జరిగిన కార్యక్రమంలో ఊరంతా కొత్త బట్టలు 
-దైవికి సేవ చేయాలన్నదే ఆశయమంటున్న అజయ్ IMG-20251213-WA0035

జగిత్యాల జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన దేవాలయాలు,ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి జాక్ పట్ అజయ్ నేనున్నా అంటూన్నారు.ఇప్పటికీ జిల్లాలోని పలు గ్రామాల్లోని ఆలయాలకు విరాళాలు ఇస్తూ దైవ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.ఇంతకు ఎవరూ ఈ జాక్ పట్ అజయ్ అనుకుంటున్నారా.?

బీర్పూర్, డిసెంబర్, 13

 దుబాయ్ లో తెలుసు,ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. ఎలా అంటారా.?ఎందుకంటే దుబాయ్ లో ₹33 కోట్ల లక్కీ లాటరీ గెలిచాడు.ఇలా లాటరీ తో అందరికీ పరిచయం అయ్యాడు.ఉపాధికోసం దుబాయ్ వెళ్లి అక్కడే సెటిల్ కావాలఅనుకున్నాడు . అయితే అదృష్టం కలిసి రావడంతో దుబాయ్ నుండి కోటీశ్వరుడు గా ఊరికి బయల్దేరాడు. తనకు వచ్చిన డబ్బుతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ కు వచ్చాడు .త్వరలో జరుగనున్న ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామ ఎంపీటీసీగా ఎన్నికై తమ పల్లెకు సేవచేయాలని గ్రామంలోని ప్రతి ఒక్కరూ విజ్ఞప్తి చేస్తున్నారు. అదృష్టవంతుడైన అజయ్ ఇప్పటికే గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయ అభివృద్ధికి తన వంతుగా రూ కోటి రూపాయలను విరాళం అందజేశారు.వయస్సులో చిన్నవాడైన అజయ్ ఈ విధంగా దైవ సేవా కార్యక్రమాల్లో భాగంగా పెద్దవిరాళం ఇవ్వడం ద్వారా గ్రామంలో తన కుటుంబానికి మంచి గుర్తింపు లభించింది.ఆర్థికంగా బలపడిన కుటుంబాలు నగరాలకు వలస వెళ్తున్నాయి కానీ,అజయ్ మాత్రం తమ కుటుంబానికి,గ్రామానికి న్యాయం చేసేందుకు సొంత ఊరు లోనే ఉంటున్నారు.ఇలా చేయడం ద్వారా అజయ్ అందరినీ ఆకర్షిస్తున్నాడు.అందరితో కలిసి పోయే వ్యక్తిత్వం కలిగిన అజయ్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలిసి చాలా మంది గ్రామ పెద్దలు,ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు.అజయ్ అదృష్టవంతుడే అంటున్నారు.

శ్రీ కృష్ణ పౌండేషన్ తో పెక్కు మంది కి సహాయం:
ఓగుల అజయ్ 

-రాజకీయాల గురించి నేను ఇప్పుడే చెప్పను .శ్రీ కృష్ణ పౌండేషన్ ద్వారా బడి పిల్లలకు 600 సైకిళ్ళు ఇవ్వడం జరిగింది.జగిత్యాల జిల్లా లోని జగిత్యాల, పెంబట్ల, ధర్మపురిమండలం లోని పలు దేవస్థాణాలతో పాటు పొరుగు జిల్లలతో సహా పలు మండలాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్న ఆలయాల అభివృద్ధికి కృషిగా డబ్బు ఇచ్చాడు.తన యింట్లో శుభకార్యక్రమాలలో పాల్గొన్న ఊరు మహిళలందరికీ కొత్త చీరెలు పంపిణీ చేయడం,ఊర్లో ఉన్న ఆటో డ్రైవర్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టాడు, ఇది కాకుండా ఆపదలో ఉన్నవారికి తోచినవిధంగా నగదు రూపంలో సాయం అందించడం జరిగింది. శ్రీ కృష్ణ ఫౌండేషన్ తో  ఆపదలో ఉన్నా వారి గూర్చి సమాచారం తెలుసుకొని కుల, మతాలకు అతీతంగా పిన్న వయస్సులోనే సేవలు చేయడం అభినందనీయం.

Tags: