దాడిలో వ్యక్తి మృతి

దాడిలో వ్యక్తి మృతి

దాడిలో వ్యక్తి మృతి

చిట్టి డబ్బుల ఆశలో ప్రాణం తీసిన దారుణ ఘటన

జగిత్యాల IMG-20251231-WA0131

కరీంనగర్ రోడ్డులోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట డబ్బుల లావాదేవీలకు సంబంధించిన వివాదం ప్రాణాంతకంగా మారింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగిన జగిత్యాల శివారు గోవింద పల్లెకు చెందిన కొలగాని అంజయ్య అనే వ్యక్తిపై దాడి జరగడంతో ఆయన మృతి చెందారు. కొలగాని అంజయ్య మరో వ్యక్తికి అప్పుగా కొంత డబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విషయమై బుధవారం రాత్రి రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు అతడిని కలసి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన అప్పు తీసుకున్న వ్యక్తి తన కుమారులను అక్కడికి పిలిపించి, అప్పు ఇచ్చిన వ్యక్తిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడి తీవ్రతకు బాధితుడు రోడ్డుపై కూలిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతను తన ద్విచక్ర వాహనంపై హాస్పిటల్ కు వెళ్ళగా అక్కడ చికిత్స మొదలవుతుండగానే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు

నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సంఘటనతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, స్థానికులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags: