రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 

వ్యవసాయ సహకార సంఘాల కు నాంనేటెడ్ వద్దు ఎన్నికలతో రైతులకు మేలు 

చురకలు విలేఖరి వీణవంక డిసెంబర్ 28:
ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలకు నామినేటెడ్ పాలక వర్గాలు వస్తే రైతులకు సహకారం అంతంత మాత్రమే ఉంటుందని, బొంతుపల్లి సర్పంచ్,మాజీ ఉప సర్పంచ్ లు, వీణవంక పీఏసీ ఎస్ సభ్యులైన,బావు సంపత్, చదువు జితేందర్ రెడ్డి, నరహరి మల్లారెడ్డి  అన్నారు.మార్కెట్ కమిటీల వలె పీఏ సీఎస్ లకు సైతం చేర్మెన్, వైస్ చేర్మెన్, డైరెక్టర్ లను నామినేటెడ్ చేస్తారని గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయని, అలా ఐతే జవాబు దారుతనం ఉండదని, మల్లారెడ్డి అన్నారు.ఈ ఎన్నికలు పార్టీ రహిత గుర్తులతో జరిగే విషయం విధితమే అన్నారు.పాలక వర్గాలు నాంనేట్ చేయడం వలన సహాకార సంఘాల్లో తప్పులు, అక్రమాలు జరిగితే బయటకు చెప్పేవారు ఉండరని, అందులో అధికార పార్టీ వారే ఉండడం వలన పనిచేసే ఉగ్యోగులు సతమతం అవుతారని అన్నారు. సంఘ సభ్యులచే డైరెక్టర్లను ఏన్ను కోబడితే,వారికి నచ్చిన వారిని ఎన్నుకుంటారని, నామనేటెడ్ ఐతే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సేవచేసే వారికీ పదవులిస్తారని ఇక్కడ కావలిసింది పార్టీకి సేవ చేసే వారు కాదు, రైతులకు సేవచేసే వారు కావాలన్నారు.అందరు అధికార పార్టీ వారైతే  జవాబుదారి తనం కొరవడుతుందని,అందువల్ల ప్రభుత్వం పునరాలోచన చేయాలని బావు సంపత్, జితేందర్ రెడ్డి అన్నారు.IMG-20251228-WA0147

Tags: