ఓపెన్ జిమ్ల నిర్వహిణ ఎవరి బాధ్యత? ఆనంతుల రమేష్

ఓపెన్ జిమ్ల నిర్వహిణ  ఎవరి బాధ్యత? ఆనంతుల రమేష్

*ఓపెన్ జిమ్ ల నిర్వహణ ఎవరి బాధ్యత...*

 *కాంట్రాక్టర్ దా... నగరపాలక సంస్థదా...?*

- *కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేశ్*

కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు  నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్ దా..నగరపాలక సంస్థ దా అని కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ ప్రశ్నించారు.. ఆదివారం కిసాన్ నగర్ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3.60 కోట్లతో నగరంలో పలుచోట్ల  యుద్ధ ప్రాతిపాదికన 30 జిమ్ములు ఏర్పాటు చేసారని.. ఒక్కో ఓపెన్ జిమ్ కు 12 లక్షల వ్యయంతో  ఏర్పాటుచేసి వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు.. చలికాలం కావడంతో ఎక్కడ చూసినా ఓపెన్ జిమ్ లు కిటకిటలాడుతున్నాయని వ్యాయామం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని... తీరా ఓపెన్ జిమ్ముల వద్ద పరికరాలు చెడిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఓపెన్ జిమ్ లు చెడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. పేర్కొన్నారు.. ఎన్నిసార్లు నగరపాలక సంస్థ అధికారులకు నిర్వహణ విషయం తెలియజేసిన పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.. ఓపెన్ జిమ్ లు  గత పాలక వర్గం నగర ప్రజల ఆరోగ్యం కోసం పెట్టారా... కమిషన్ల కోసం పెట్టారా అర్థం కావడం లేదని పేర్కొన్నారు..

 - *పార్కులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం నేరం..*
నగరంలో చాలా పార్కుల్లో పిల్లల ఆట వస్తువులు చెడిపోతున్నాయని.. ప్రజల ఆరోగ్యం - ఆహ్లాదం కోసం ఏర్పాటుచేసిన పార్కులను  ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడంపై విమర్శలుచాలా ఉన్నాయని, ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పార్కులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల సామాజిక ప్రయోజనాలు తగ్గి, వాణిజ్య ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉందని, ఇది పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు..
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్కులను అభివృద్ధి చేసి..ప్రైవేటు భాగస్వామ్యం అవసరమైతే, దానిపై కఠినమైన నిబంధనలు విధించాలని..ప్రజల భాగస్వామ్యంతో పార్కులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెంచాల కరుణాకర్ చాతర్ల సాయిరాం, ఫరజ్ తదితరులు ఉన్నారు..IMG-20251214-WA0120

Tags: