నా వల్ల కాంగ్రెస్ కు, జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా, డిసిసి అధ్యక్షుడు నందయ్య

• జగిత్యాల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ
• సభకు హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
• డీసీసీ అధ్యక్షుడు నందయ్యను నిలదీసిన జీవన్ రెడ్డి వర్గీయులు
• ఎమ్మెల్యే సంజయ్‌తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తి
• మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలోనే డీసీసీ అధ్యక్షుడిని ప్రశ్నించిన జీవన్ రెడ్డి వర్గం
• డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఘాటు వ్యాఖ్యలు
• “యువజన కాంగ్రెస్ నాయకులు నాపై నమ్మకం ఉంచాలి… ఇంకా నాకు ప్రొబేషన్ పీరియడ్ నడుస్తోంది” – నందయ్య
• “నా వల్ల జగిత్యాల కాంగ్రెస్‌కు లేదా జీవన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా”
• “అధ్యక్ష పదవి కోసం కకృతి పడటం లేదు… రాజీనామా పత్రం జేబులోనే ఉంది”
• “నా పదవి జీవన్ రెడ్డి ఇచ్చిన భిక్ష… ఆయనకు నందయ్య అంటే నమ్మిన బంటు అనే పేరు ఉంది”
• “లూజ్ కామెంట్స్ చేయొద్దు… ఇష్టం లేకపోతే ఇదే స్టేజ్‌పై రాజీనామా చేసి వెళ్తా”
• “జీవన్ రెడ్డి అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లను”
• “నేను కాంగ్రెస్‌కు గరుడుగట్టిగా తీవ్రవాది… ఈ పదవి ఉన్నా ఒకటే, పోయినా ఒకటే”

