సర్పంచ్, ఉపసర్పంచ్ లకు సన్మానం
నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సన్మానం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా జున్ను రాజేందర్, ఉప సర్పంచ్‌గా మొహమ్మద్ రూమన్ ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా జగిత్యాల మ్యాంగో మార్కెట్ అధ్యక్షుడు అమినుద్దీన్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి దిశగా ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పని చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మ్యాంగో మార్కెట్ కార్యవర్గ సభ్యులు మల్లేశం, ఇక్బాల్ భాయ్, పాషా, కె. శ్రీనివాస్, చల్‌గల్ మైనార్టీ అధ్యక్షుడు ఆసిఫ్, హసీబ్, కడల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

