మొబైల్ ఫోన్ పొతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి
*- - మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: :
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*- - - మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.*
*- - - జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.*
*సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ గారు అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరి గురైన 27 లక్షల విలువగల 136 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.*
ఈ సందర్భంగా ఎస్పీ
మాట్లాడుతూ... పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల విలువగల 1548 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని,CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సాంకేతిక ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ CEIR టీం RSI కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు,అజర్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.సాంకేతిక ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ కి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
*పుట్టినరోజు కానుకగా ఇచ్చిన ఫోన్ రికవరీ:* జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిప్పన్నపేట గ్రామానికి చెందిన రమ్యకు ఆమె తండ్రిగారు పుట్టినరోజు కానుకగా ఇచ్చిన మొబైల్ ఫోన్‌ను రమ్య కంప్యూటర్ క్లాస్‌కు వెళ్లే సమయంలో అనుకోకుండా పోగొట్టుకుంది. ఫోన్ కోసం వెతికినా దొరకకపోవడంతో రమ్య వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేసింది.ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, ఫోన్‌కు సంబంధించిన IMEI వివరాలను సేకరించి CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. సకాలంలో చేపట్టిన చర్యలతో పోలీసులు ఆ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి రికవరీ చేసి బాధితురాలు రమ్యకు తిరిగి అందజేశారు.మొబైల్‌ను తిరిగి అందించినందుకు రమ్య హర్షం వ్యక్తం చేస్తూ, తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి ఇచ్చిన అమూల్యమైన కానుకను తిరిగి పొందడంలో సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.
*పొలం వద్ద బండిలో ఉంచిన మొబైల్ దొంగతనం – CEIRతో రికవరీ* బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన రైతు తిరుపతి తన వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన సమయంలో తన మొబైల్ ఫోన్‌ను బండిలో ఉంచి పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అప్రమత్తం లోపాన్ని ప్రయోజనం చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ను దొంగిలించారు.ఫోన్ దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న తిరుపతి వెంటనే బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే స్పందించి, మొబైల్ ఫోన్ IMEI నంబర్‌ను CEIR పోర్టల్‌లో నమోదు చేసి ట్రాకింగ్ ప్రారంబించి ఆ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి రికవరీ చేసి బాదితుడు తిరుపతికి తిరిగి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంత వేగంగా స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తున్నారని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అని ఫోన్ తిరిగి పొందడంలో సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
*బస్టాండ్‌లో ఛార్జింగ్‌కు పెట్టిన మొబైల్ దొంగతనం – పోలీసుల చర్యతో రికవరీ* జగిత్యాల పట్టణానికి చెందిన జ్యోతి తన అత్తవారింటికి వెళ్లేందుకు స్థానిక బస్టాండ్‌కు వచ్చింది. ప్రయాణానికి ముందు తన మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి అక్కడే వేచి ఉండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ను దొంగిలించారు.ఫోన్ కనిపించకపోవడంతో జ్యోతి తన అన్న సురేష్‌కు విషయం తెలియజేసింది. వెంటనే అతడు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందిస్తూ, ఫోన్‌కి సంబంధించిన IMEI వివరాలను సేకరించి CEIR పోర్టల్ ద్వారా ట్రాకింగ్ ప్రారంభించారు.సాంకేతిక ఆధారాలతో ఫోన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు దొంగిలించబడిన మొబైల్‌ను స్వాధీనం చేసుకుని బాధితురాలు జ్యోతి అన్న కి కి తిరిగి అందజేశారు. తన చెల్లి కి ఎంతో విలువైన ఫోన్‌ను తిరిగి అందించినందుకు లక్ష్మణ్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ , CEIR టీం R కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు యాకూబ్ ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

