99 టివి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

99 టివి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

99టీవీ  క్యాలెండర్ ను ఆవిష్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

జగిత్యాల

 

IMG-20260116-WA0011ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర 99 టీవీ క్యాలెండర్ ను  జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల గొంతుకగా నిలుస్తున్న 99టీవీ  ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. 99టీవీ వార్తల సేకరణలో నిజాయతీగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య బలమైన అనుసంధాన కర్తగా పనిచేస్తుందని ప్రశంసించారు.. 99 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, జగిత్యాల నియోజకవర్గం ప్రజలకు, పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 99 టీవీ ఇంకా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 99టీవి రిపోర్టర్ మోసిక్, తెలంగాణ   వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఇమ్రాన్, సీనియర్ జర్నలిస్ట్ టీవీ సూర్యం, టి. యు. డబ్ల్యో, జె, ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడు హైదర్ అలీ, హరి, జర్నలిస్ట్ రాజేష్, హరీష్, రాజి రెడ్డి, నరేష్, మహేష్, సంతోష్,   కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడ్వాల జ్యోతిలక్ష్మణ్, రాజ్ కుమార్, బాల శంకర్, నజీమ్, నఫీషియ మజీద్ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ ఖురేషి , తదితరులు పాల్గొన్నారు.

బైట్ : డా. సంజయ్ - జగిత్యాల ఎమ్మెల్యే.

Tags: