పవర్ స్టార్ వాగ్దానానికి ఐదేళ్లు

పవర్ స్టార్ వాగ్దానానికి ఐదేళ్లు

పవర్ స్టార్ వాగ్దానానికి ఐదేళ్లు
*తమ్ముడు మాట ఇచ్చావు మూట ఎప్పుడో  !?
*కొండగట్టు అంజన్న ఎదురు చూస్తున్నారు..
* ₹11 లక్షల విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్..
*మరిచిపోయారా ? ఎవరితోనైనా ఇప్పటికే పంపించారా??
     చురకలు, ప్రత్యేక     ప్రతినిధి
సినిమారంగంలో అభినవ కర్ణుడిగా పేరొందిన పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న కు ఇచ్చిన హామీ మరిచిపోయారు. స్నేహితులకు ఆపద లో ఉన్న వారికి, సినిమా కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ పెద్ద మొత్తంలో సహాయం చేస్తూ ఉంటారని వింటుంటాం. కానీ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం రూ. 11 లక్షలు విరాళం ఇస్తానని ఐదు సంవత్సరాల క్రితం వాగ్దానం చేసి మరిచిపోయారు. జనసేన తెలంగాణ లో పర్యటించిన సందర్భంగా ఆయన రెండు సంవత్సరాల క్రితం జగిత్యాల మీదుగా కొండగట్టు వెళ్లి అంజన్న దర్శనం చేసుకున్నారు. తానే కాకుండా తన కుటుంబం మొత్తం ఆంజనేయస్వామి భక్తులమని స్వామి కి కానుకగా రూపాయలు 11 లక్షలు పంపిస్తానని ఆ సందర్భంగా ప్రకటించారు. తాను ప్రమాదాల్లో పడ్డ సమయంలో అంజన్న తనను రక్షించి ఈ స్థాయికి తీసుకు వచ్చాడని , పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆలయ అభివృద్ధికి అర్చ కుల సంక్షేమం కోసం ఈ కానుక నిధులు కేటాయించాలని సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ స్థాయి నాయకులు మాట ఇచ్చి మరిచిపోలేని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. బిజీ లో పడి మరిచిపోయారా?? ఇతరులతో ఎవరితో నైనా సంబంధిత డబ్బులు పంపించారా?? అనే అనుమానాలు కూడా లేకపోలేదు.  పవన్కళ్యాణ్ ప్రకటించిన 11 లక్షలు ఆలయానికి అందుతే నెలరోజుల కష్టాలు తీరిపోతాయి అని భక్తులు పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద నటుడిని డైరెక్టుగా కలుసుకునే అవకాశం దొరకడం అసాధ్యం. షూటింగ్ బిజీలో ఆయన ఏ దేశంలో ఉంటాడో సన్నిహితులకు తప్ప ఇతరులకు తెలియడం వీలు కాదు. చురకలు పత్రిక ద్వారానైనా పవన్ కళ్యాణ్ స్నేహితులు ఈ సమాచారాన్ని పవన్కు చేరవేసి  అంజన్నకు ఇచ్చిన 11 లక్షల హామీ నెరవేర్చిన విధంగా చూడాలని కొండగట్టు అంజన్న భక్తులు  కోరుతున్నారు. 

టి టి డి నిధులు సరే మీ సహాయం ఏదిScreenshot_20260103_101206_Google

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అందించే ప్రభుత్వ సహాయం సరే గాని స్వంత విరాళాలు ఏమయ్యాయు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పవన్ ఇప్పటికైనా తాను అందిస్తా అన్నా విరాళాలు అందించాలని భక్తులు కోరుతున్నారు.

Tags: