కొండగట్టు లో భారీ అగ్ని ప్రమాదం

కొండగట్టు లో భారీ అగ్ని ప్రమాదం

Screenshot_20251130_062749_WhatsApp

*కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం @ మంటలను ఆర్పుతున్న జగిత్యాల అగ్నిమాపకదళ సిబ్బంది*

*- హుటా హుటిన బయలుదేరి సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది* 


జగిత్యాల జిల్లా కొండగట్టు పెద్ద హనుమాన్ విగ్రహం వద్ద నుండి జగిత్యాల కరీంనగర్ హై వే వరకు దాదాపు 25 బొమ్మల షాపులు దగ్ధమైనట్టు జగిత్యాల అగ్నిమాపకదళం సిబ్బంది ఒక సమాచారంలో తెలిపారు. మంటలను ఫైర్ ఇంజన్ ద్వార ఆర్పుతున్నట్టు తెలిపారు. జగిత్యాల నుండి ఒక్క ఫైర్ ఇంజన్ వెళ్ళింది, ధర్మపురి నుండి ఒక ఫైర్ ఇంజన్, కరీంనగర్ నుండి ఒక ఫైర్ ఇంజన్ కొండగట్టు వస్తున్నట్టు తెలిపారు. మంటలు అదుపులోకి వస్తున్నట్టు తెలిపారు.
భారీ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణం తెలియలేదు. ప్రాణ నష్టం లేదని తెలిపారు. మిగతా సమచారం అందిస్తామని అగ్నిమాపకదళ సిబ్బంది  తెలిపారు.

Tags:

Related Posts