తుంగూర్ లో తరగని అదరణ, 493 ఓట్ల మెజారిటీతో రాజగోపాల్ రావు విజయం
తుంగూర్ లో తరగని ఆదరణ
-ఆనాటి చేయూతకు అభిమానం చాటుకున్నా గ్రామస్థులు
493 ఓట్ల మెజారిటి తో రాజగోపాల్ రావు విజయం
బీర్పూర్, డిసెంబర్, 14
బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామస్టులు రాజగోపాల్ రావు 30 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ ఓటేసి అక్కున చేర్చుకున్నారు.35 ఏళ్ల నాడు ఆ గ్రామంలో ప్రజాప్రతినిధి కావడం..అప్పటి పరిస్థితులకు ఇబ్బంది పడ్డ ఆయన ఎంతో ఆవేదనతో ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ వచ్చి ఆయన గ్రామస్థుల్లో ఒకరిగా ఉండడం…కొందరు నాగన్న,రాజన్న అంటే,ఇంకొందరి నుండి గోపన్న, కొందరు బాపు అనే పిలుచుకుంటున్నారు.అలాంటి మంచి మనిషి గా గుర్తింపు పొందిన ఆయన అదే స్థాయిలో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.అందుకే గ్రామస్తులు గట్టిగా వెంట నిలబడి 493 ఓట్ల భారీ మెజార్టీ తెచ్చిపెట్టారు. రాజకీయాలకు మూడు దశబ్దాలు దూరంగా ఉన్నా తమ గ్రామస్తులకు తోచిన రీతిలో సాయం అందించారని చెబుతున్నారు.అప్పటి సారంగాపూర్ మండలం లోని తుంగూర్ గ్రామ సర్పంచ్గా 1987 నుండి ఏడు ఏళ్ల పాటు అభివృద్ధి చేయడం, అతర్వాత తుంగూర్ ఎంపిటిసి గా ఎన్నికై అప్పడు కొందరు సృష్టించిన ఇబ్బందుల దృష్ట్యా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన గ్రామస్తులకు దూరం కాకపోవడం, ఊరు మీద ఉన్నా ప్రేమతో అభివృద్ధి కార్యక్రమలలో తనకు తోచిన సహకారం అందించడంతో,తాను గ్రామ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో లేకపోయిన అభివృద్ధి లో తన వంతు బాధ్యత నిర్వహించడం తో ప్రజలు ఆదరించడం జరిగింది. గ్రామం లోని రెండు స్కూల్ లకు స్థలం ఇవ్వడం, గుడి కోసం స్థలం ఇవ్వడం జరిగిందని పలువురు గ్రామస్తులు అతనిసేవలు కొనియాడారు.
సర్పంచ్ ఎన్నికల్లో మళ్లీ రాజగోపాలరావు విజయం సాధించడంతో ఆయన చేసిన సేవలకు తిరిగి గుర్తుగా ఆయన్ని గెలిపించు కున్నామని ఊరు ఊరంతా సాంబారాలు చేసుకోవడం జరిగింది.
గ్రామాభివృద్ధి కోసం లక్ష్యం ఉన్నాపనులు చేయలేక ఎంపిటిసి గా ఉండి దేశం కాని దేశాశనికి వెళ్ళిపోయి, తిరిగి గత కొన్నేళ్లుగా ఊరు అభివృధి లక్ష్యంగా తన శేష జీవితం గ్రామానికి అంకితం చేసి పోటీ చేయాడంతో ఊరు కోసం మంచి పనులు చేస్తున్న వారిని ఆదర్శంగా తమకడుపులో పెట్టుకుని చూసుకుంటారని రాజగోపాల్ రావు ఎన్నిక ఫలితాలు చూస్తే అర్థం అవుతోంది.
తుంగుర్ కు మంచిచేయాలనే తపనతో
పోటీ చేసిన రాజగోపాల్ రావు స్పష్టం,
కన్నతల్లి లాంటి గ్రామానికి అంతో ఇంతో చేయాలన్న ఆలోచన మళ్లీ మొదలై, అందుకే ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో సర్పంచ్ గా నిలబడిన రాజగోపాల్ రావు ను ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అవసరమైతే నాజేబు నుంచి డబ్బులు వెచ్చించే శక్తి కూడా ఉంది.మూడు దశబ్దాలు రాజకీయలకు దూరంగా ఉన్నా, సర్పంచ్ పదవి జనరల్ స్థానం కేటాయుంచడం తో ఊరుకు తన వంతు అభివృద్ధి చేయాలని తిరిగి రాజకీయoలో వచ్చిన తర్వాత మిత్రులు,గ్రామస్తుల సహకారంతో బరిలో నిలిచిన రాజగోపాల్ రావు ను పాత తరం వారితో పాటు,ఈ తరం వారి అభిమానం అందుకోవడం తోనే భారీ మెజారిటి వచ్చిందని పలువురు పేర్కొన్నారు.

