కాంగ్రెస్ హామీలు ప్రజలకు శాపాలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ హామీలు ప్రజలకు శాపాలు...
రెండు సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యం
ప్రజల ఓటు దెబ్బతో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
చురకలు విలేఖరి వీణవంక డిసెంబర్ 14:
ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు శాపాలుగా మారాయని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.ఆదివారం వీణవంక మండలంలోని బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు
ఘన్ముక్ల గాజుల శంకర్, ఎలబాక మణికొండ రమ భూమయ్య,రెడ్డిపల్లి అడిగోప్పల నిర్మల సత్యనారాయణ కు మద్దతు గా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి వసుళ్ళకు పాల్పడుతూ రాష్ట్ర అభివృద్ధిని దయనీయంగా మార్చిందని అన్నారు. గడిచిన రెండు సంవత్సరాల లో అభివృద్ధి తిరోగమనం దిశగా మారింది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి రైతులకు కనీసం యూరియా బస్తా కూడా అందించకుండా ఇబ్బందులకు గురి చేశాయి అన్నారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ముఖ్యంగా రైతులు రాజు చేసి చూపించాడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రైతులను నడిరోడ్డున నిలబెట్టిన ఘనత కూడా కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. మహిళలకు 2500 రూ .. వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు పెంచలేదు.ఆడబిడ్డ పెళ్లికి లక్ష తో పాటు తుల బంగారం ఇవ్వట్లేదు. మరి ఎందుకు కాంగ్రెస్ ఓటు వేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ముందుగానే చెప్పాడని మోసపోతే గోసపడతామని ఈరోజు అక్షర సత్యమైందని అన్నారు. మొదటి విడతలు కాంగ్రెస్కు ప్రజలు తమ ఓటుతో చాలా బాగా బుద్ధి చెప్పారని,రానున్న మూడో విడుదల కూడా ప్రజలు తమ ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి సమాధానం ఇవ్వాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మండలంలోని అన్ని గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మాడ సాధవరెడ్డి, కొత్తిరెడ్డి కాంతారెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, జున్నుతుల సునీత మల్లారెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి,
బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

