ఐయంఏ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలికి ఘన సన్మానం
By: Mohammad Imran
On
ఐఎంఏ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలికి ఘన సన్మానం
కోరుట్ల
, డిసెంబర్ 30 ::--
రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మహిళా విభాగం అధ్యక్షురాలిగా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వీతీ అనుప్ నియమితులైన సందర్భంగా ఆమెకు ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి నేమూరి భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నేమూరి భూమయ్య మాట్లాడుతూ డాక్టర్ స్వీతీ అనుప్ భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్నో ఉన్నత పదవులను అలంకరించి కోరుట్ల పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో కోరుట్ల సాయిబాబా ఆలయ చైర్మన్ బాలే నరసయ్య, ధర్మకర్తలు గడ్డం కిరణ్, చిలివేరి విద్యాసాగర్, నిమ్మల శ్రీనివాస్, కోటగిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు
Tags:

