పైడి పల్లి లో పోలీసుల లాఠీ చార్జీ, పోలీస్ వాహనాలు ధ్వసం, రాళ్లు రువ్విన గ్రామస్తులు

పైడి పల్లి లో పోలీసుల లాఠీ చార్జీ, పోలీస్ వాహనాలు ధ్వసం, రాళ్లు రువ్విన గ్రామస్తులు

 

పెద్ద తలకాయలు జోక్యంతో ఫలితాలు తారుమారని ఆరోపణ 


 రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ 

గ్రామస్తులపై పోలీసుల లాఠీ ఛార్జ్ గాల్లో కి కాల్పులు 

 రాళ్లు రువ్వి పోలీసు వాహనాలు ధ్వంసం 

 వెల్గటూర్ 

జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామంలోIMG-20251217-WA0101 ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది బ్యా లట్ బాక్స్ లు బయటకు వెళ్ళకుండా గ్రామస్తులు ఎందుకు అడ్డుకుంటున్నారు. కొందరు పెద్ద తలకాయల జోక్యంతో చివరి నిమిషంలో సర్పంచ్ ఫలితాన్ని తారు మారు చేశారని ఆరోపిస్తూ ఓ అభ్యర్థికి మద్దతుగా గ్రామస్తులు యువత పోలింగ్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ కాస్త ఉగ్ర రూపం దాల్చి బ్యాలెట్ బాక్స్ లు బయటకు రాకుండా పోలింగ్ కేంద్రం ముందు వందలాది మంది బైటాయించి నిరసన కు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి యువతను చెదర గొడుతున్న పట్టు వీడని గ్రామస్తులు రెండు గంటలుగా న్యాయం కావా లని పోరాడుతున్నారు. రీ కౌంటింగ్ చేయాలని డి మాండ్ చేస్తున్నారు.  చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి లాటిచార్జ్ చేసి గ్రామస్థులను చెదరగొట్టగా గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ గొడవలో ఓ పోలీసు కు గాయమైనట్లు సమాచారం. కాగా చివరకు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని బ్యాలెట్ బాక్స్ లను వెంటనే అక్కడి నుంచి పోలీసులు తరలించినట్లు సమాచారం . పైడి పల్లి గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి.అయితే ఓట్ల లెక్కింపు లో కౌంటింగ్ కేంద్రం లోకి కొందరు పెద్ద తలకాయలు వెళ్లి ఫలితాన్ని  చివరలో తారుమారు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేయడంతో గొడవ మొదలైంది. పోలింగ్  సిబ్బంది రీ కౌంటింగ్ కు ఒప్పు కోవటం లేదు.ఫలితంగా గ్రామస్తులంతా ఏకమై నిరసనకు దిగారు. మా ప్రాణం పోయిన బ్యాలెట్ బాక్స్ లు ఇక్కడి నుండి తీసుకెళ్ళ నివ్వమని గేటుకు అడ్డంగా బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలో ఉద్రిక్త వాతా వరణం నెలకొనగా పోలీసులు రంగ ప్రవేశం చేసి యువతను చెదర గొట్టారు. అయిన గ్రామస్తులంతా ఏకమై నిరసనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పుతున్నారు. ఇంకా నిరసన కొనసాగుతునే ఉంది. మేము న్యాయ బద్దంగానే ఫలితాల లెక్కింపు చేశామని ఆర్ ఓ చెప్పటం విశేషం. ఇదిలా ఉంటే  పోలీసులు ప్రజలకు  ఎంత నచ్ఛ చెప్పిన న్యాయం కావాలని  మొండి పట్టు పట్టగా పోలీసులు ప్రజల మధ్యన తీవ్రమైన ఘర్షణ చెలరేగింది. దీంతో  పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపగా ప్రజలు పోలీసుల పై రాళ్ళు రువ్వినట్లు సమాచారం.ఈ ఘ ర్షణలో ఇటు పోలీసులు అటు గ్రామస్తులు గాయపడినట్లు సమాచారం.కాగా కొంత మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని బ్యాలెట్ బాక్స్ లను అక్కడి నుండి సురక్షితంగా తరలించినట్లు సమాచారం .

పోటో,పైడిపల్లి లో పోలింగ్ కేంద్రముందు  బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

Tags: