రోడ్డు ప్రమాదం లో ఇద్దరి మృతి
By: Mohammad Imran
On
రోడ్డుప్రమాదం ఇద్దరి మృతి
చురకలు విలేఖరి
జగిత్యాల, జనవరి, 17
హైదరాబాద్‌లో చదువుకుంటున్న నవనీత్, సాయి, సృజన్
సంక్రాంతి సెలవుల కోసం జగిత్యాలకు వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఫ్రెండ్స్‌తో కలిసి రూరల్ మండలం పోరండ్ల వద్ద పార్టీ చేసుకుని కారు లో తిరిగి వస్తుండగా, మద్యం మత్తులో అతివేగంగా వెళ్తున్న వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, అనంతరం డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ముగ్గురు యువకుల్లో నవనీత్, సాయి తేజ ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా, సృజన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:

