నల్గురి కోసం ఈ గోపన్న
నల్గురి
కోసం ఈ గోపన్న..
-11 ఏళ్ల పాటు దుబాయ్ లో గడిపారు.
-అంతకు ముందే ఆ గ్రామా సర్పంచ్,ఎంపీటీసీ కూడా..
-నలుగురికి సాయం చేసే మంచి మనిషి గా పేరు
-శేష జీవితాన్ని గ్రామసేవకే అంకితం
బీర్పుర్, డిసెంబర్, 12
ఇప్పటి బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామంలో పుట్టి పెరిగిన రాజగోపాల్ రావు ఆ గ్రామంలో ప్రజాప్రతినిధి కావడం..అప్పటి పరిస్థితులకు ఇబ్బంది పడ్డ ఆయన ఎంతో ఆవేదనతో ఊరు విడిచి వెళ్లిపోయారు.కొందరు నాగన్న అంటే,ఇంకొందరి నుండి గోపన్న, కొందరు బాపు అనే పిలుపు ఉండేది అలాంటి మంచి మనిషి గా గుర్తింపు పొందిన ఆయన గూర్చి అప్పటి నక్సల్స్ దళానికి తప్పుడు సమాచారం ఇచ్చి రాజగోపాల్ రావును ఇబ్బందులు పెట్టారని తుంగూర్ వాసులు తెలిపారు. అయితే ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా తమ గ్రామస్తులకు తోచిన రీతిలో సాయం అందించారని చెబుతున్నారు.అప్పటి సారంగాపూర్ మండలం లోని తుంగూర్ గ్రామ సర్పంచ్గా 1987 నుండి ఏడు ఏళ్ల పాటు అభివృద్ధి చేయడం జరిగింది. అతర్వాత తుంగూర్ ఎంపిటిసి గా ఎన్నికై అప్పడు కొందరు సృష్టించిన ఇబ్బందుల దృష్ట్యా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం జరిగింది. ఆ తర్వాత కూడా ఊరు మీద ఉన్నా ప్రేమతో అభివృద్ధి కార్యక్రమలలో తనకు తోచిన సహకారం అందిస్తున్నారు. తాను గ్రామ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో లేకపోయిన అభివృద్ధి లో తన వంతు బాధ్యత నిర్వహించడం జరిగిందని, గ్రామం లోని రెండు స్కూల్ లకు స్థలం ఇవ్వడం, గుడి కోసం స్థలం ఇవ్వడం జరిగిందని పలువురు గ్రామస్తులు అతనిసేవలు కొనియాడారు.
ప్రస్తుతం దేశం విడిచి తమ ఊరికి తిరిగి రావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మళ్లీ రాజగోపాలరావు విజయం సాధించి తీరుతారని,ఆయన చేసిన సేవలకు తిరిగి గుర్తుగా ఆయన్ని గెలిపించు కుంటమని ఊరు ఊరంతా శపథం చేస్తున్నది.
ఉద్యమం బలంగా ఉన్న ఆనాడు కూడా స్వార్థ పరులు కొందరు ఇచ్చిన టప్పుడు సమాచారం తో ఊరికి సేవ చేసే మంచి వాడిని దూరం చేసుకున్నామని తుంగూర్ ఓటర్లు అంటున్నారు.ఐతే గ్రామాభివృద్ధి కోసం లక్ష్యం ఉన్నాపనులు చేయలేక ఎంపిటిసి గా ఉండి దేశం కాని దేశాశనికి వెళ్ళిపోయాడు. తిరిగి గత కొన్నేళ్లుగా ఊరు అభివృధి లక్ష్యంగా తన శేష జీవితం గ్రామానికి అంకితం చేయాలని పోటీ చేస్తున్నాడు.ఊరు కోసం మంచి పనులు చేస్తున్న వారిని ఆదర్శంగా తమకడుపులో పెట్టుకుని చూసుకుంటారని రాజగోపాల్ రావు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్న తీరు చూస్తే అర్థం అవుతోంది.
తుంగుర్ కు మంచిచేయాలనే తపనతో
పోటీ చేస్తున్న రాజగోపాల్ రావు స్పష్టం
-కన్నతల్లి లాంటి గ్రామానికి అంతో ఇంతో చేయాలన్న ఆలోచన మళ్లీ మొదలైంది అందుకే ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో సర్పంచ్ గా నిలబడిన.ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అవసరమైతే నాజేబు నుంచి డబ్బులు వెచ్చించే శక్తి కూడా ఉంది.మూడు దశబ్దాలు రాజకీయలకు దూరంగా ఉన్నా, సర్పంచ్ పదవి జనరల్ స్థానం కేటాయుంచడం తో ఊరుకు తన వంతు అభివృద్ధి చేయాలని తిరిగి రాజకీయoలో వచ్చిన తర్వాత మిత్రులు,గ్రామస్తుల సహకారంతో బరిలో నిలిచాం.పాత తరం వారికి,ఈ తరం వారి అభిమానం కూడా అందుకుంటున్నరు.
రాజగోపాల్ రావు హయాంలో తుంగూర్ గ్రామంలో
బతుకమ్మ వాగు వద్ద బ్రిడ్జి,
మాల గూడెం లో కరెంట్ స్తంభాలు , వీధి దీపాలు
గొల్ల గూడెం సైడ్ మురికి కాలువ నిర్మాణం,
హరిజన వాడికి ఇళ్ల స్థలాలు,
ఇంటింటికి కరెంట్ 40 ఇళ్లకు,
బీడీ కార్మికులకు 20 ఇండ్లు,
అన్ని వాడల సైడ్ డ్రైనేజి,7వ తరగతి నుండి 10 వ తరగతి వరకు
స్కూల్ అప్గ్రేడ్,
పశువుల దవాఖాన మంజూరు,
కందెన కుంట నాయకపు వాడ లో ఇండ్లు ,
గొల్ల వాడలో పోచమ్మ గుడి నిర్మాణం,
తను సర్పంచ్ కాక ముందు ఉరికి నాలుగు వైపులా రోడ్లు ఊరిలోకి రావాలంటే నీటిని దాటి రావాల్సి ఉండేదని, వెంటనే నాలుగు వైపులా రోడ్డు రిపేర్ అవసరం, అయినా చోట డ్రైనేజి రోడ్ నిర్మాణం రాజగోపాల్ రావు హయాంలో జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు.

